తంబకాయ

(తంబ కాయలు నుండి దారిమార్పు చెందింది)

తంబ కాయ (Canavalia gladiata) కూరగాయ జాతులలో ఒకటి. తీగ జాతికి చెందిన ఈ మొక్క సుమారు ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాయలు సుమారు ఒక అంగుళం పైగా వెడల్పు కలిగి సుమారు ఒక అడుగు పొడుగు పెరుగుతాయి. కాయలు కత్తి ఆకారంలో ఉండటం వలన సాధారణంగా దీన్ని ఆంగ్లంలో స్వోర్డ్ బీన్ (Sword bean) అని వ్యవహరిస్తారు. ఫాబేసీ కుటుంబానికి చెందిన ఈ పప్పుదినుసును మధ్య, దక్షిణమధ్య భారతదేశపు ప్రాంతాలలో కూరగాయగా ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క పెద్దస్థాయిలో సాగులో లేదు. తెలుగులో దీనినే చమ్మకాయ, తమ్మికాయ అని కూడా వ్యవహరిస్తారు.

తంబకాయ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
సి. గ్లాడియేటా
Binomial name
కెనావలియా గ్లాడియేటా
దస్త్రం:Tamba kaayalu.jpg
తంబకాయలు

ఆసియా, ఆఫ్రికా ఖండపు ప్రాంతాలలో ఈ మొక్క యొక్క కాయలను కూరగాయగా ఉపయోగిస్తారు.[1]

తంబకాయలు

వెంకట్రామాపురంలో తీసిన చిత్రము]]

మూలాలు

మార్చు
  1. Grubben, G.J.H. & Denton, O.A. (2004) Plant Resources of Tropical Africa 2. Vegetables. PROTA Foundation, Wageningen; Backhuys, Leiden; CTA, Wageningen.
"https://te.wikipedia.org/w/index.php?title=తంబకాయ&oldid=2985953" నుండి వెలికితీశారు