శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ పతాకంపై కిషోర్ కుమార్ పార్థాసాని దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నిర్మించిన సినిమా తడాఖా. ఎన్‌. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన వెట్టై అనే తమిళ సినిమా యొక్క తెలుగు పునఃనిర్మాణమైన ఈ సినిమాలో సునీల్, నాగ చైతన్య, తమన్నా, ఆండ్రియా జెరెమియా ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మే 10, 2013న విడుదలై విజయం సాధించింది.

తడాఖా
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం కిషోర్ కుమార్ పార్థాసాని
నిర్మాణం బెల్లంకొండ గణేష్
కథ ఎన్‌. లింగుస్వామి
చిత్రానువాదం కిషోర్ కుమార్ పార్థాసాని,
దీపక్ రాజ్
తారాగణం సునీల్
నాగ చైతన్య
తమన్నా
ఆండ్రియా జర్మియా
అశుతోష్ రాణా
సంగీతం ఎస్.ఎస్. తమన్
నృత్యాలు రాజు సుందరం,
ప్రదీప్ ఆంటోని,
శోభి
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
రామజోగయ్య శాస్త్రి
సంభాషణలు కిషోర్ కుమార్ పార్థాసాని,
వేమారెడ్డి
ఛాయాగ్రహణం ఆర్థర్ ఏ. విల్సన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు (కొణిదల నాగేంద్రబాబు)కి ఇద్దరు కొడుకులు. వారే శివరామకృష్ణ (సునీల్), కార్తీక్ (నాగ చైతన్య). ఇందులో శివరామకృష్ణ బాగా భయస్తుడు, కార్తీక్ ఎంతో ధైర్యంగా ఎవరితోనైనా గొడవ పెట్టుకునే మనస్తత్వం కలవాడు. అలాంటి తరుణంలో గుండె పోటుతో నాగబాబు మరణిస్తాడు. కార్తీక్ ఎలా గోలా శివరామకృష్ణని ఒప్పించి నాగబాబు పోలీస్ జాబ్ తనకి వచ్చేలా చేస్తాడు. సునీల్ కి పోస్టింగ్ వచ్చిన ఏరియాలో బగ్గా (అశుతోష్ రానా), కాశీ అనే ఇద్దరు రౌడీలు దోపిడీలు, రౌడీయిజం, స్మగ్లింగ్ చేస్తూ ప్రజల్ని, పోలీసుల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు. అలాంటి ఊరికి ఎస్ఐగా వచ్చిన శివరామకృష్ణ అదే ఊర్లోలో (ఆండ్రియా జెరేమియా)ని పెళ్ళి చేసుకుంటాడు. మరోపక్క కార్తీక్ లో చెల్లెలైన పల్లవి (తమన్నా) ప్రేమించుకుంటారు. ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో శివరామకృష్ణకి ఓ కేస్ అప్పగిస్తాడు. తన తమ్ముడు కార్తీక్ సాయంతో శివరామకృష్ణ ఆ కేస్ ని క్లోజ్ చేస్తాడు. అలాగే ఒకసారి బగ్గా స్మగ్లింగ్ చేస్తున్న లారీలను సీజ్ చేస్తాడు. దాంతో శివరామకృష్ణకి – బగ్గాకి మధ్య వైరం మొదలవుతుంది. ఆ తర్వాత శివరామకృష్ణ పిరికోడని కార్తీక్ అతని వెనకుండి నడిపిస్తున్నాడని తెలుసుకున్న బగ్గా అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. కార్తీక్ ద్వారా చావు నుంచి తప్పించుకోగలగిన శివరామకృష్ణ ఆ తర్వాత ఎలా మారాడు? అన్నదమ్ములిద్దరూ కలిసి బగ్గా సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసారు అనేదే మిగిలిన కథాంశం.

పురస్కారాలు మార్చు

2013 సైమా అవార్డులు

  1. ఉత్తమ సహాయనటుడు (సునీల్)

స్పందన మార్చు

  • రెండున్నర గంటల సేపు చూసిన సినిమాలోని ఏ ఒక్క సన్నివేశమూ మళ్ళీ తలుచుకోవాలని పించదు. వెళ్ళాం.. చూశాం… వచ్చాం అనే అనిపిస్తుంది. నాగచైతన్య లవర్ బోయ్ మాత్రమే కాదు… ఫైట్స్ కూడా చేయగలడు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నమే ‘తడాఖా’ తప్పితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు.[1] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు మార్చు

  1. వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "మాస్ హీరోగా 'తడాఖా' చూపేందుకు నాగచైతన్య తహతహ!". ఓంప్రకాశ్ రాతలు గీతలు. Retrieved 15 February 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=తడాఖా&oldid=4135893" నుండి వెలికితీశారు