తరుణ్ గొగోయ్ అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 6 సార్లు లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు పర్యాయాలు అసోం శాసనసభకు ఎన్నికై, మూడుసార్లు అసోం ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

తరుణ్ గొగోయ్
తరుణ్ గొగోయ్


అస్సాం 13వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
18 మే 2001[1] – 24 మే 2016
గవర్నరు శ్రీనివాస్ కుమార్ సిన్హా
అరవింద్ దావే
అజయ్ సింగ్
శివ చరణ్ మాథుర్
కే. శంకరనారాయణన్
సయెద్ రజి
జానకి బల్లభ్ పట్నాయక్
పద్మనాభ ఆచార్య
ముందు ప్రఫుల్ల కుమార్ మహంత
తరువాత సర్బానంద సోనోవాల్

పదవీ కాలం
1993 – 1995
ప్రధాన మంత్రి పి. వి. నరసింహారావు
ముందు గిరిధర్ గమాంగ్
తరువాత కామాఖ్యా ప్రసాద్ సింగ్ దేవ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 2001
ముందు కేశాబ్ మహంత
తరువాత డిప్ గొగోయ్
నియోజకవర్గం కాళియబోర్
పదవీ కాలం
1991 – 1996
ముందు భద్రేశ్వర్ తంతి
తరువాత కేశాబ్ మహంత
నియోజకవర్గం కాళియబోర్
పదవీ కాలం
1971 – 1984
ముందు రాజేంద్రనాథ్ బారువా
తరువాత పరాగ్ చలియా
నియోజకవర్గం జోర్హాట్

శాసనసభ్యుడు
పదవీ కాలం
20 సెప్టెంబర్ 2001 – 23 నవంబర్ 2020
ముందు డిప్ గొగోయ్
నియోజకవర్గం ఠితబర్
పదవీ కాలం
1996 – 1998
ముందు కూల్ బహదూర్ ఛెత్రి
తరువాత ప్రద్యుత్ బోర్డోలాయ్
నియోజకవర్గం మార్గెరిటా

వ్యక్తిగత వివరాలు

జననం (1936-04-01)1936 ఏప్రిల్ 1
రంగమాటి, జోర్హాట్ జిల్లా, అస్సాం
మరణం 2020 నవంబరు 23(2020-11-23) (వయసు 84)
గువహాటి, అస్సాం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి డాలీ గొగోయ్
సంతానం చంద్రిమ గొగోయ్, గౌరవ్ గొగోయ్
పూర్వ విద్యార్థి గౌహతి యూనివర్సిటీ, (ఎల్‌ఎల్‌బీ)
వృత్తి న్యాయవాది, రాజకీయ నాయకుడు
పురస్కారాలు పద్మ భూషణ్
మూలం Government of Assam

జననం, విద్యాభాస్యం

మార్చు

తరుణ్ గొగోయ్ 1936 ఏప్రిల్ 1న అసోం రాష్ట్రం, జోర్హాట్ జిల్లా జిల్లా, రంగమాటిలో జన్మించాడు. అతను రంగాజన్ నిమ్న బునియాడి విద్యాలయ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అస్సాంలోని గువహాటి విశ్వవిద్యాలయం నుంచి 1963లో ఎల్ఎల్‌బీ పట్టా అందుకున్నాడు.

వివాహం

మార్చు

తరుణ్ గొగోయ్ కు 1972 జూలై 30లో డాలీ గొగోయ్ ను వివాహమాడాడు. వారికీ కొడుకు గౌరవ్ గోగొయ్, కూతురు చంద్రిమ గోగొయ్ ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు
  • 1968: జోర్హాట్ మునిసిపల్ బోర్డు సభ్యుడు
  • 1971: 5వ లోక్‌సభకు ఎన్నిక
  • 1976: జాతీయ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి
  • 1977: 6వ లోక్‌సభకు ఎన్నిక (2వ సారి)
  • 1983: 7వ లోక్‌సభకు ఎన్నిక (3వ సారి).
  • 1983: జాతీయ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి
  • 1985: జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
  • 1986–1990: అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
  • 1991: 10వ లోక్‌సభకు ఎన్నిక (4వ సారి)
  • 1991–1993: కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
  • 1993–1995: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
  • 1993–1995: అసోం శాసనసభ సభ్యుడు
  • 1998-1999 12వ లోక్‌సభకు ఎన్నిక (5వ సార్లు).[2]
  • 2001 మే 18: అసోం ముఖ్యమంత్రి (మొదటి సారి)
  • 2001 సెప్టెంబరు: తితాబర్ నియోజకవర్గం నుంచి అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2006 మే 11: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2006 మే 14: అసోం ముఖ్యమంత్రి (2వ సారి)
  • 2011 మే 13: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2011 మే 18: అసోం ముఖ్యమంత్రి (3వ సారి)
  • 2016 మే 19: అసోం శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నిక

తరుణ్ గొగోయ్ 2020 నవంబరు 23న అనారోగ్యంతో బాధపడుతూ గౌహతిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించడంతో మరణించాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. ZEE NEWS (18 May 2001). "Tarun Gogoi sworn in as new Assam Chief Minister". zeenews.india.com. Archived from the original on 3 జూలై 2020. Retrieved 3 July 2020.
  2. Lok Sabha (2019). "Tarun Gogoi". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
  3. 10TV (23 November 2020). "కన్నుమూసిన గోగొయ్" (in telugu). Retrieved 30 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. V6 Velugu (23 November 2020). "అస్సాం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్ కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)