గౌరవ్ గొగోయ్ (జననం 4 సెప్టెంబర్ 1982) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2020 నుండి 2024 వరకు లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉప నాయకుడిగా పని చేశాడు.[3]

గౌరవ్ గొగోయ్
గౌరవ్ గొగోయ్


లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్ ఉప నాయకుడు
పదవీ కాలం
27 ఆగస్టు 2020 – 4 జూన్ 2024
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ద్రౌపది ముర్ము
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
నాయకుడు *అధీర్ రంజన్ చౌదరి (2020-2021, 2021-2024)

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు తోపాన్ కుమార్ గొగోయ్
నియోజకవర్గం జోర్హాట్
పదవీ కాలం
16 మే 2014 – 4 జూన్ 2024
ముందు డిప్ గొగోయ్
నియోజకవర్గం కలియాబోర్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-09-04) 1982 సెప్టెంబరు 4 (వయసు 42)
ఢిల్లీ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు తరుణ్ గొగోయ్
డాలీ గొగోయ్
జీవిత భాగస్వామి ఎలిజబెత్ కోల్‌బోర్న్ గొగోయ్[1]
బంధువులు గణేష్ గొగోయ్ (గ్రాండ్ అంకుల్)
పరణ్ బార్బరూహ్ (మామ)
ప్రేరణ బార్బరూహ్ (కజిన్) డిప్ గొగోయ్ (మామ)
చంద్రిమా గొగోయ్ (సోదరి)
నివాసం 55, అజంతా పాత్, బెల్టోలా సర్వే, గౌహతి, అస్సాం
పూర్వ విద్యార్థి ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం
న్యూయార్క్ విశ్వవిద్యాలయం ( MPA )
వృత్తి సామాజిక కార్యకర్త
రాజకీయవేత్త

గౌరవ్ గొగోయ్‌ను 2023 రాజస్థాన్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.[4] గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో 2023 ఆగస్టు 8న రెండో మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.[5][6]

జననం, విద్యాభాస్యం

మార్చు

గౌరవ్ గొగోయ్ 4 సెప్టెంబర్ 1982న తరుణ్ గొగోయ్, డాలీ గొగోయ్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలోని సెయింట్ కొలంబా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బీటెక్ చేశాడు. ఆయన ఆ తర్వాత 2004లో ఇంద్రప్రస్థ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరాడు. తరువాత గౌరవ్ గొగోయ్ అమెరికాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

గౌరవ్ 2013లో ఎలిజబెత్ కోల్‌బర్న్‌ను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ 2001 నుండి 2016 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన మేనమామ గణేష్ గొగోయ్ ప్రసిద్ధ కవి, ఒక మేనమామ పరణ్ బార్బరువా సినిమా నిర్మాత & కజిన్ ప్రేరణ బార్బరువా సినిమా దర్శకుడు.[7]

రాజకీయ జీవితం

మార్చు

గౌరవ్ గొగోయ్ 2014లో తన తండ్రి తరుణ్ గొగోయ్ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కలియాబోర్ నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. గౌరవ్ 2020 నుండి 2024 వరకు లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉప నాయకుడిగా పని చేశాడు.[8]

మూలాలు

మార్చు
  1. "Assam CM's son Gaurav Gogoi files nomination for LS polls". Jagran.com. 19 March 2014. Retrieved 20 March 2014.
  2. "Political tango: Lok Sabha MP Gaurav Gogoi gives a peek into his life". 13 February 2021. Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  3. News18 (27 August 2020). "Ahead of Monsoon Session, Congress Appoints Gaurav Gogoi as Deputy Leader, Ravneet Bittu as Whip in LS" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Congress Appoints Assam MP Gaurav Gogoi Chairman Of Screening Committee For Rajasthan Elections" (in ఇంగ్లీష్). 3 August 2023. Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  5. "'Compelled to move no-confidence motion to end PM Modi's vow of silence': Congress' Gaurav Gogoi". August 8, 2023.
  6. "No-Confidence Motion Highlights: Supreme Court order ratified INDIA bloc's no-confidence motion: RSP MP". India Today.
  7. TV9 Bharatvarsh (2024). "गौरव गोगोई लोकसभा चुनाव 2024 उम्‍मीदवार". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.