తలారి రంగయ్య

తలారి రంగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[1]

తలారి రంగయ్య
తలారి రంగయ్య


పార్లమెంట్ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం
ముందు జె. సి. దివాకర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 03 జూన్ 1970
గోసుపాడు, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు తలారి రంగయ్య , వెంకటమ్మ
జీవిత భాగస్వామి తలారి ఉష
సంతానం సాయి హర్ష & సాయి శ్రావ్య
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యంసవరించు

తలారి రంగయ్య 03 జూన్ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, గోస్పాడు మండలం, గోసుపాడు లో తలారి రంగయ్య , వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అనంతపూర్ లోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి పి.హెచ్.డి పూర్తి చేసి పరీక్షలు రాసి గ్రూప్‌–1 అధికారిగా నియమితుడయ్యాడు. ఆయన గ్రూప్‌–1 అధికారిగా డీఆర్డీఏ పీడీగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితంసవరించు

తలారి రంగయ్య ఫిబ్రవరి 2018లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జె. సి. పవన్ కుమార్ రెడ్డి పై 1,41,428 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలుసవరించు

  1. Lok Sabha (2019). "Members : Lok Sabha". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  2. Sakshi (2 April 2019). "విశ్వసనీయతకు ప్రతిరూపం జగన్‌". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  3. Sakshi (2019). "AP Lok Sabha Election Results 2019 | Andhra Pradesh MP Election Results and Winners List". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  4. Sakshi (2019). "Anantapur Constituency Winner List in AP Elections 2019 | Anantapur Constituency Lok Sabha Election Results". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.