A dandelion taproot, shown with the plant.
The taproot of carrots.

తల్లివేరు ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. గింజ అంకురింపగనే, మొలకను చలనము లేక స్థిరముగ నిలువబెట్టుటకును, ఆహార పదార్థములను సేకరించుకొనుటకు వేరు భూమిలోనికి పోవుచున్నది. ఎన్ని వంకరలుగ విత్తును పాతిపెట్టినను వేరు పైకి వచ్చుటలేదు. ఇది దాని నైజము. అటు భూమిలోనికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగ కొన్ని వేరులు పుట్టుచున్నవి. ఆ మొదటి పెద్ద వేరునకు తల్లివేరు అని పేరు. శాఖవేరులను పిల్లవేర్లు అంటారు. వరి, ఈత మొక్క, జొన్న, గడ్డి మొదలగువానికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.


మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తల్లివేరు&oldid=2953891" నుండి వెలికితీశారు