తాళ్లాయపాలెం గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామము.[1]

తాళ్లాయపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తుళ్ళూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీశైవక్షేత్రంసవరించు

  1. ఈ గ్రామంలొ నవంబరు 10, 2011 గురువారం నాడు పవిత్ర కృష్ణా నదీ తీరంలొ భూలోక కైలాసంగా భాసిల్లుచున్న శ్రీ శైవ క్షేత్రంలో నెలకొల్పిన భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం మహోత్సవాల్ని పురస్కరించుకొని ఈ శ్రీశైవక్షేత్రంలో వివిధ కార్యక్రమాలూ నిర్వహించెదరు.[2]
  2. ఈ గ్రామములో శివుడు, కోటిలింగేశ్వరస్వామిగా కొలువుదీరియున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, అహ్లాదకరమైన పరిసరాలమధ్య ఉన్న ఈ ఆలయం, కృష్ణానదీ తెరం లో ఉన్నది. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ప్రకటితమవుచున్న ఈ క్షేత్ర దర్శనం, సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. [2]
  3. ఈ క్షేత్రంలో, 2015,మే నెల-28వ తేదీనుండి 30వ తేదీ వరకు, ద్వాదశ వార్షికోత్సవం, ధ్వజస్థంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [3]
  4. ఈ క్షేత్రంలో 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రినాడు, అర్ధరాత్రి శ్రీ దక్షిణామూర్తి, శ్రీ అమృతలింగేశ్వరస్వామివారల ఆలయాలలో విగ్రహ, శిఖర ప్రతిష్ఠలు నిర్వహించెదరు. [4]

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-04-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-05. Cite web requires |website= (help)
  2. [ఈనాడు-గుంటూరు,నవంబరు 11, 2011, పేజీ-16. ]