తాళ్ళపాలెం (పొన్నూరు)
(తాళ్ళపాలెం(పొన్నూరు) నుండి దారిమార్పు చెందింది)
తాళ్ళపాలెం, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]
తాళ్ళపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°04′05″N 80°33′07″E / 16.068°N 80.552°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని విశేషాలు
మార్చు- అప్పట్లో గాంధీజీ హరిజనోద్ధరణ కార్యక్రమాలకు పిలుపునిచ్చి, పొన్నూరు పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. రైతుబాంధవుడు శ్రీ ఎన్.జి.రంగాపిలుపు మేరకు, గాంధీజీని నిడుబ్రోలులోని రామానీడు రాజకీయ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేశారు. తాళ్ళపాలెంలో ఉన్న ఎక్కువ మంది జియ్యరుదాసులు స్వాతంత్ర్యోద్యమంలో పాలు పంచుకొనుట వలన, రంగాగారి ఆహ్వానం మేరకు, 1933లో, గాంధీజీ తాళ్ళపాలెం గ్రామాన్ని సందర్శించారు. నిడుబ్రోలు రైల్వే స్టేషను నుండి, ఆలూరు మీదుగా తాళ్ళపాలెం చేరుకొని, గ్రామస్థులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీ రామా ఆశ్రమ పాఠశాలను గూడా గాంధీజీ సందర్శించారు. కాలక్రమేణా ఆ పాఠశాల గాంధీ ఆశ్రమంగా పేరొందినది. ఆ ఆశ్రమంలో పేదలకు అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన ప్రసంగించిన ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హరిజనోద్ధరణ పిలుపు మేరకు తాళ్ళపాలెంలో దేవాలయాన్ని గూడా నిర్మించారు. ఇటీవల జి.బి.సి. రహదారి నుండి తాళ్ళపాలెం వెళ్ళే రహదారికి "గాంధీమార్గం"గా నామకరణం చేశారు. జాతిపిత అడుగు పెట్టిన తాళ్ళపాలెం గ్రామం, ఆయన అడుగుజాడలలోనే, వివాదాలకు ఆమడ దూరంలో నిలుస్తున్నది. గాంధీజీ కన్న కలలకు అనుగుణంగానే ఎన్నికల సమయంలో ఓటుహక్కుని స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య పద్ధతిలో వినియోగించుకుంటున్నారు. చిన్న కుగ్రామమయినా పురోగమనంలో ముందుకు దూసుకుపోతున్నది. ఇప్పుడిప్పుడే విద్యావంతుల సంఖ్య గూడా పెరుగుతున్నది. గ్రామంలో రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగించేవారు ఎక్కువగా ఉండటంతో, గ్రామం చుట్టూ, పచ్చని పొలాలతో ప్రశాంత వాతావరణంతో ఉంటుంది.
- 1923లో జాతిపిత మహాత్మా గాంధీ నిడుబ్రోలు రైల్వే స్టేషనులో దిగి నడచుకుంటూ, ఈ గ్రామం చేరుకుని, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సంఘటనకు గుర్తుగా 2014,డిసెంబరు-2వ తేదీన, ఈ గ్రామంలో గ్రామస్థులు గాంధీగారి విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-25.