తిప్పరా మీసం
తిప్పరా మీసం 2019, నవంబరు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మాణ సారథ్యంలో కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, నిక్కి తాంబోలి, రోహిణి తదితరులు నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.[1][2]
తిప్పరా మీసం | |
---|---|
దర్శకత్వం | కృష్ణ విజయ్ |
రచన | కృష్ణ విజయ్ |
నిర్మాత | రిజ్వాన్ |
తారాగణం | శ్రీ విష్ణు, నిక్కి తాంబోలి, రోహిణి |
ఛాయాగ్రహణం | సిద్ |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థలు | రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | శ్రీ ఓం సినిమా |
విడుదల తేదీ | 8 నవంబరు 2019 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీ విష్ణు (మణిశంకర్)
- నిక్కీ తంబోలి (మౌనిక)
- రోహిణి (మణి తల్లి లలిత)
- బెనర్జీ (మణి మామ)
- ప్రవీణ్
- నేహా దేశ్‌పాండే
- రఘువరన్ (మణి మరణించిన తండ్రిగా ఫోటో చూపబడింది)
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్
- నిర్మాత: రిజ్వాన్
- సంగీతం: సురేష్ బొబ్బిలి
- ఛాయాగ్రహణం: సిద్
- కూర్పు: ధర్మేంద్ర కాకరాల
- నిర్మాణ సంస్థ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ ఎల్ ప్రొడక్షన్స్
- పంపిణీదారు: శ్రీ ఓం సినిమా
నిర్మాణం
మార్చుఈ చిత్రంలో శ్రీవిష్ణు మీసాలు, గడ్డం పెంచుకుని డీజే పాత్రను పోషించాడు. అతని పాత్ర నెగిటీవ్ షేడ్ లో ఉంటుంది.[3] ఈ చిత్రానికి కృష్ణ విజయ్ దర్శకత్వం వహించగా నిక్కి తంబోలి, రోహిణి తదితరులు నటించారు. సహాయ పాత్రలో నటించడానికి నేహా దేశ్‌పాండే సంతకం చేసింది.[4] సెప్టెంబరులో ఈ చిత్ర టీజర్ విడుదలైంది.[5] కృష్ణ విజయ్ గతంలో శ్రీవిష్ణుతో కలిసి అసుర (2015) సినిమాకు పనిచేశాడు.[6] ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఫిబ్రవరిలో విడుదలై, వేసవిలో విడుదల కావాల్సి ఉంది.[4][7]
శ్రీవిష్ణు నటించిన బ్రోచెవరేవరురా (2019) సినిమా విడుదలై విజయవంతమైనప్పటి నుండి ఈ చిత్రం ప్రజాదరణ పొందింది.[2] తిప్పారా మీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.[2] ఈ చిత్ర ట్రైలర్ నవంబరు 6న విడుదలైంది. ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కులను ఆసియా సినిమాస్ కొనుగోలు చేసింది.[8]
పాటలు
మార్చుఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. మొదటి పాట "ధేత్తడి పోచమ్మగుడి" సెప్టెంబరులో, రెండవ పాట "మౌన హృదయ రాగం" అక్టోబరులో విడుదలయ్యాయి.[9][10][11][12]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "దేత్తడి పోచమ్మ గుడి (రచన: పూర్ణాచారి)" | పూర్ణాచారి | సురేష్ బొబ్బిలి, నరేష్ మామిండ్ల | 3:27 |
2. | "మౌన హృదయ రాగమే (రచన: పూర్ణాచారి)" | పూర్ణాచారి | రంజని | 4:05 |
3. | "రాధ రమణం (రచన: పూర్ణాచారి)" | పూర్ణాచారి | అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్ | 3:53 |
4. | "తిప్పరా మీసం (రచన: పూర్ణాచారి)" | పూర్ణాచారి | హేమచంద్ర, క్రాంతి సంజయ్ | 3:23 |
5. | "ట్రాన్స్ పాట (రచన: అల రాజు)" | అల రాజు | నరేష్ మామిండ్ల, రోహిత్, నందన్ రాజ్ | 3:08 |
మొత్తం నిడివి: | 17:46 |
విడుదల
మార్చుటైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది.[13] "శ్రీ విష్ణు, రోహిణి తల్లి కొడుకులుగా బంధాల విలువను చూపించారు" అని ది హిందూ పత్రికలో రాశారు.[14]
మూలాలు
మార్చు- ↑ "Sree Vishnu's 'Thipparaa Meesam' has a release date - Times of India". The Times of India.
- ↑ 2.0 2.1 2.2 "Sree Vishnu's 'Thipparaa Meesam' to release on November 8". Telangana Today.
- ↑ "I play the role of a DJ who is careless and bad: Sree Vishnu - Times of India". The Times of India.
- ↑ 4.0 4.1 Kavirayani, Suresh (February 7, 2019). "Sree Vishnu's Thipparaa Meesam's first look". Deccan Chronicle.
- ↑ "'Thipparaa Meesam' teaser gets attention from film buffs - Times of India". The Times of India.
- ↑ Pecheti, Prakash. "Thippara Meesam to change Sree Vishnu's career graph". Telangana Today.
- ↑ "Vibrant first look of Sree Vishnu from 'Thipparaa Meesam' is here! - Times of India". The Times of India.
- ↑ "Thipparaa Meesam Trailer: Badass Sree Vishnu steals the show in this unconventional action drama - Times of India". The Times of India.
- ↑ "Mouna Hrudaya Ragam is a comforting resonance from Thipparaa Meesam - Times of India". The Times of India.
- ↑ "Dhethadi Pochammagudi: A mass number from Sree Vishnu's Thipparaa Meesam - Times of India". The Times of India.
- ↑ "Thipparaa Meesam - Suresh Bobbili - Download or Listen Free - JioSaavn". JioSaavn.
- ↑ "Thipparaa Meesam Jukebox - Sree Vishnu - Suresh bobbili - Krishna Vijay L". Lahari Music. 7 November 2019.
- ↑ "Thipparaa Meesam Movie Review {2/5}: Goes off the rails hard and fast!". The Times of India.
- ↑ Dundoo, Sangeetha Devi (November 8, 2019). "'Thippara Meesam' review: An interesting story let down by a meandering narrative". The Hindu.