రఘువరన్

ప్రముఖ సినీ నటుడు

రఘువరన్ (డిసెంబర్ 11, 1948 - మార్చి 19, 2008) దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. ప్రతినాయక పాత్రలు పోషించి మెప్పించాడు. దాదాపు 150 సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాలున్నాయి.

రఘువరన్
RaghuSir.JPG
జననండిసెంబర్ 11, 1958
Kollengode, కేరళ
మరణం2008 మార్చి 19(2008-03-19) (వయసు 49)
వృత్తిసినిమా నటుడు
ఎత్తు6 అ. 3 అం. (191 cమీ.)
జీవిత భాగస్వామిరోహిణి (విడాకులు)
పిల్లలురిషివరన్
తల్లిదండ్రులువేలాయుధన్, కస్తూరి.

జననంసవరించు

రఘువరన్ కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లాకు చెందిన కోలెంగూడె అనే ప్రాంతమునందు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వేలాయుధన్, కస్తూరి.

తెలుగు నటి రోహిణితో ఆయనకు వివాహం జరిగింది. వారికి సాయి రిషివరన్ అనే కొడుకు ఉన్నాడు. అయితే వారు తరువాత విడాకులు తీసుకున్నారు.

మరణంసవరించు

చిత్రరంగంలో బాగా విజయవంతమైనా ఆయన మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిస కావడంతో జీవితం ఒడిదుడుకులకు గురైంది. రఘువరన్ మార్చి 19, 2008చెన్నైలో గాఢ నిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించాడు. దీర్ఘకాలం మద్యం సేవించడం వలన ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నది. చనిపోవడానికి కొద్దిరోజులకు ముందు ఆయన నిద్రలో ఉండగా చనిపోయే సన్నివేశంలో నటించడం యాదృచ్ఛికంగా జరిగింది.

కెరీర్సవరించు

శివ, పసివాడి ప్రాణం, బాషా మొదలైన సినిమాలలో ఆయన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. 2008లో వచ్చిన ఆటాడిస్తా రఘువరన్ చివరి సినిమా.

నటించిన తెలుగు సినిమాలుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రఘువరన్&oldid=3736486" నుండి వెలికితీశారు