తిరుక్కణ్ణపురం

భారతదేశంలోని గ్రామం

తిరుక్కణ్ణపురం ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

తిరుక్కణ్ణపురం
తిరుక్కణ్ణపురం is located in Tamil Nadu
తిరుక్కణ్ణపురం
తిరుక్కణ్ణపురం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :10°31′N 79°25′E / 10.52°N 79.42°E / 10.52; 79.42
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:నాగపట్నం
ప్రదేశం:తిరుక్కణ్ణపురం, నన్నిలమ్‌
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శౌరిరాజ పెరుమాళ్ (విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:కణ్ణపురనాయకి (లక్ష్మీదేవి)
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:నిత్య పుష్కరిణి
విమానం:ఉత్పలావర్తక విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ఆండాళ్
కులశేఖరాళ్వార్
నమ్మాళ్వార్
పెరియాళ్వార్
ప్రత్యక్షం:కణ్వ మహర్షి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు మార్చు

ఇక్కడ పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో ప్రతిష్ఠితమై ఉన్నాడు. పెరియ పెరుమాళ్ల మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణునికై ప్రతి అమావాస్యనాడు దక్షిణముఖ మండలం వైపు తిరిగి ఆరాధనలను అందుకుంటున్నాడు. క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసాడు. దానిని సహింపజాలని అరయరుస్వామి పెరుమాళ్‌ను ప్రార్థించగా స్వామి పలుకలేదని చేతిలోని తాళమును స్వామిపైకి విసిరివేసాడు. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇందుకు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రము ధరించి యున్నాడు. ఇచట గరుత్మంతుడు గొప్ప తపమాచరించి పెరుమాళ్ల ఎదుట నిలిచి ఉన్నాడు.ఇక్కడ ప్రతినిత్యము రాత్రిసమయాన బియ్యముతో సమానముగా నేతిని ఉపయోగించి పొంగలిని పెరుమాళ్లకు నివేదిస్తారు. ఇది మిక్కిలి ప్రభావము కలదని భక్తుల విశ్వాసం.

సాహిత్యంలో తిరుక్కణ్ణపురం మార్చు

శ్లోకము

శ్రీ మత్కణ్ణ పురేతు నిత్య సరసీ సంశోభితే ప్రాజ్ముఖం
దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీశౌరి రాజప్రభుమ్‌ |
వైమానే స్థిత ముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ్‌ |

పాశురము

పామాలై నణ్ణి తొ దె మినో వినైకెడ;
కాలైమాలై కమల మలరిట్టు నీర్
వేలై మోదుమ్‌ మదిళ్‌శూ తిరుక్కణ్ణ పురత్తు;
ఆలిన్ మేలాలమరన్దాన్ అడియిణైగళే. - నమ్మాళ్వార్ తిరువాయిమొళ్ 9-10-1.

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
శౌరిరాజ పెరుమాళ్ కణ్ణపురనాయకి నిత్య పుష్కరిణి తూర్పుముఖము నిలుచున్న భంగిమ నమ్మాళ్వార్; కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ ఉత్పలావర్తక విమానము కణ్వ మహర్షికి ప్రత్యక్షము

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు