తిరుక్కోవిలూరు

(తిరుక్కోవలూరు నుండి దారిమార్పు చెందింది)
  ?తిరుక్కోవలూరు
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 11°57′N 79°12′E / 11.95°N 79.2°E / 11.95; 79.2
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 73 మీ (240 అడుగులు)
జిల్లా (లు) విల్లుపురం జిల్లా
జనాభా 27,108 (2001 నాటికి)

తిరుక్కోవలూరు లేదా తిరుక్కోయిలూరు (Tirukkoyilur) తమిళనాడు రాష్ట్రం, విల్లుపురం జిల్లా (పూర్వ దక్షిణ ఆర్కాట్ జిల్లా) లోని అతి ప్రాచీనమైన పంచ కృష్ణారణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఇది తిరువణ్ణామలైకు దక్షిణంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి త్రివిక్రమ స్వామి దేవాలయం 108 వైష్ణవ దివ్యదేశాలలో మొదటిది.

తిరుక్కోవిలూరు
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఆయనార్(త్రివిక్రముడు)
ప్రధాన దేవత:పూంగోవల్ నాచ్చియార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కృష్ణ పుష్కరిణి
విమానం:శ్రీకర విమానము
కవులు:ఆళ్వార్-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:మృకండుమహర్షికి, బలిచక్రవర్తికి
శివాలయం

వ్యుత్పత్తి

మార్చు

'తిరు' + 'కోవిల్ + 'ఊరు' = పవిత్రమైన ఆలయ గ్రామం అని తమిళంలో అర్ధం.

'తిరువిక్రమన్' + 'కోవిల్' + 'ఊరు' = తిరుకోవిలూరు.

విశేషాలు

మార్చు

పంచకృష్ణారణ్య క్షేత్రములలో నొకటి. శ్రీకృష్ణుని నిత్యసాన్నిధ్యము కలక్షేత్రము. ముదలాళ్వార్లని ప్రఖ్యాతులైన పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అను ముగ్గురు ఒకరి వెనుక ఒకరుగా ఈ దివ్యదేశానికి వేంచేసి ఒక అరుగుపై నిలచుని యుండగా వీరి సంశ్లేషమును గోరిన పెరుమాళ్ళు వీరిమధ్యకు వచ్చి నిలచుండిరి. తమ మధ్య మరియెవరో నుండిరని భావించిన ఆళ్వార్లుకు పెరుమాళ్లు సేవ సాయింపగా ఆళ్వార్లు వరుసగా ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది మూన్ఱాం తిరువందాదులు అను గ్రహించిన స్థలము. ముదలాళ్వార్లు మువ్వురు ఇటనే తిరునాడలంకరించిరి. ఇచట మూలవర్ త్రివిక్రమన్ కుడిపాదము పైకి ఎడమపాదము క్రిందకు గలదు. కుడిచేత శంఖము ఎడమచేత చక్రము ధరించియుందురు. మీనం-ఉత్తరా నక్షత్రం తీర్థోత్సవము-వృశ్చికమాసము కైశికి ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగును. మరునాడు ద్వాదశి రోజున ఎంబెరుమానార్ జీయర్‌కు బ్రహ్మరథోత్సవం జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై వేదాంత దేశికులు దేహలీశస్తుతి యను స్తోత్రమును అనుగ్రహించిరి.

సాహిత్యం

మార్చు

శ్లో. శ్రీమత్కృష్ణ సరోవరేణ కలితే శ్రీ కోవలూర్ పట్టణే
   భాతి శ్రీకర దేవయాన వసతి:పూంకోవలాఖ్యాం రమాం
   ప్రాగాస్య స్థితి రాయనారితి విభు: ప్రాప్తోమృకండోర్మునే:
   ప్రత్యక్షశ్చ బలే: సర: కలిరిపు శ్రీ భూతయోగి స్తుత:||

పాశురాలు

మార్చు

పా. తూవడివిల్ పార్ మగళ్ పూమజ్గైయోడు
           శుడరాழி శజ్గిరుపాల్ పొలిన్దు తోన్ఱ,
   క్కావడివిల్ కఱ్పగమే పోలనిన్ఱు
           కలన్దవర్ గట్కరుళ్ పురియుమ్‌ కరుత్తి నానై;
   చ్చేవడికై త్తిరువాయ్ కణ్ శివన్దవాడై
           శెమ్బొన్‌శెయ్ తిరువురువ మానాన్ఱన్నై
   త్తీవడివిల్ శివనయనే పోల్వార్ మన్ను
           తిరుక్కోవలూర దనుళ్ కణ్డేన్ నానే.
               తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-10-9

              తొండమండల తిరుపతులు

శ్లో. తుండీర మండలస్థావై దివ్యదేశా:శ్రియ:పతే:
   వర్ణ్యంతే యతిరాజాంఘ్రి పంకజాశ్రయ వైభవాత్||

యతిరాజ శ్రీపాద పద్మములను ఆశ్రయించిన తొండ మండలమున గల దివ్యదేశములను వర్ణింతును.

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆయనార్ (త్రివిక్రముడు) పూంగోవల్ నాచ్చియార్ కృష్ణ పుష్కరిణి తూర్పు ముఖము ఆళ్వార్-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ నిలచున్న భంగిమ శ్రీకర విమానము మృకండుమహర్షికి, బలిచక్రవర్తికి

చేరే మార్గం

మార్చు

పుదుచ్చేరి-బెంగళూరు, చిత్తూరు-తిరుచ్చి (వయా) వేలూరు బస్ మార్గము. విల్లుపురం-కాట్పాడి రైలుమార్గము తిరుక్కోవలూర్ స్టేషన్. కడలూర్ నుండి బస్ వసతి గలదు. అన్ని వసతులు గలవు

మంచిమాట

మార్చు

విరోధులు

మార్చు

భగవద్గుణానుభవమునకు విరోధి శబ్దాది విషయములందుగల ప్రీతి.

భగవత్కైంకర్యమునకు విరోధి ఇదినాదియను మమకారము.

సాధన విరోధి అజ్ఞానవశమున తానుకర్తను అని భావించుట.

ఈమూడు విరోధములకు కారణము అహంకారము.

కావున అహంకారమును విడచినచో విరోధులు నశింతురు.

"శ్రీ నంబిళై"

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు