తిరుపతి (ఎన్.ఎం.ఎ) అనేది భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని తిరుపతి నగరంలో ఉన్న ఒక పొరుగు ప్రాంతం.ఇది తిరుపతి పట్టణ మండలం లోని ఒక జనగణన పట్టణం.[2]

తిరుపతి (ఎన్ఎంఎ)
జనగణన పట్టణం
తిరుపతి (ఎన్ఎంఎ) is located in Andhra Pradesh
తిరుపతి (ఎన్ఎంఎ)
తిరుపతి (ఎన్ఎంఎ)
ఆంధ్రప్రదేశ్ పటంలో తిరుపతి (ఎన్ఎంఎ) స్థానం
Coordinates: 13°39′N 79°25′E / 13.650°N 79.417°E / 13.650; 79.417
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
Population
 (2011)[1]
 • Total37,968
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationAP

జనాభా గణాంకాలు మార్చు

తిరుపతి (NMA) తిరుపతి జిల్లా తిరుపతి పట్టణ మండలం లోని ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం.ఇది తిరుపతి నగర పరిసర ప్రాంతం. 2011 జనాభా లెక్కల ప్రకారం, తిరుపతి (NMA) పట్టణం మొత్తం 8,486 కుటుంబాలు నివసిస్తున్నాయి. తిరుపతి (NMA) పట్టణ జనాభా మొత్తం 37,968, అందులో 16,934 మంది పురుషులుకాగా, 21,034 మంది స్త్రీలు ఉన్నారు సగటు లింగ నిష్పత్తి 1,242.పట్టణం 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2944, ఇది మొత్తం జనాభాలో 8%గా ఉంది. 0-6 ఏళ్లలోపు మగ పిల్లలు 1532 మంది, ఆడ పిల్లలు 1412 మంది ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 922, ఇది సగటు లింగ నిష్పత్తి (1,242) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు మొత్తం 90.2%గా ఉంది.దీనిని అవిభాజ్య చిత్తూరు జిల్లా 71.5%తో పోలిస్తే తిరుపతి (NMA) అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. తిరుపతి (NMA).లో పురుషుల అక్షరాస్యత రేటు 93.27%, స్త్రీల అక్షరాస్యత రేటు 87.74% [3]

విద్య మార్చు

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ద్వారా అందించబడుతుంది. వివిధ పాఠశాలల్లో బోధనా మాధ్యమం ఆంగ్లం, తెలుగు భాషలలో జరుగుతుంది.

పరిపాలన నిర్వహణ మార్చు

తిరుపతి (NMA) సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 8,486 గృహాలను కలిగి ఉంది.వీటికి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, నిర్వహణకు దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి దీనికి అధికారం కలిగి ఉంది

మూలాలు మార్చు

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 22 November 2014.
  2. "Villages and Towns in Tirupati Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  3. "Tirupati (NMA) Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.

వెలుపలి లంకెలు మార్చు