తిరుమల కళ్యాణకట్ట

ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు (తల వెండ్రుకలు) ఇచ్చే లేదా గుండు గీయించుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. దీని వెనుక ఒక కథ ఉంది.

తిరుమలలో కళ్యాణకట్ట

ఒక సారి వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళ మాతకు స్వామి వారి జుట్టు కొంచెం ఊడిపోయి నట్టు అనిపించి స్వామి వారితో చెబుతుంది. అప్పుడు స్వామి అవును అని వకుళ మాతతో అనగా అప్పుడు వకుళ మాత బాధపడకు నాయన నీకు కలియుగాంతం వరకు నీ భక్తులే నీకు వెండ్రుకలు సమర్పిస్తారు అని చెబుతుంది. అందుకే అప్పటినుండి నేటివరకు తిరుమలకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులు అవుతుంటారు. తలనీలాల మొక్కు లేని వారు కనీసం 5 కత్తెరలు అయిన సమర్పించాలని అంటారు.

ఇది వరకు తిరుపతి దగ్గరలో ఉన్న కళ్యాణి నది ఒడ్డున తలనీలాలు తీసే ఏర్పాటు ఉండేది. తీయ బడిన జుట్టు చుట్టుప్రక్కల విస్తరించబడి అసహ్యంగా కనబడటం, మొక్కలపెరుగుదలకు ఆటంకముగా మారటం లాంటి కాలుష్య కారణాల రీత్యాతరువాతి కాలంలో అది తిరుమల కొండ పైకి మార్చబడింది.

కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం

తిరుమల కళ్యాణ కట్ట

మార్చు

మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్థానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడింది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షురకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షురకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. 2005 మేలో తలనీలాలు సమర్పించే మహిళల సౌకర్యార్ధము దేవస్థానము అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా వంద మంది మహిళా క్షురకురాళ్ళను నియమించింది.[1] తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు మూడు విడతలుగా 24 గంటలూ పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాలలో అదనంగా వంద మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానము నియమిస్తున్నది.[2] కళ్యాణకట్టలో ఉచితముగా గుండు గీస్తారు.

తిరుపతిని ప్రతిరోజూ సందర్శించే 45,000 భక్తులలో మూడవ వంతు మంది తలనీలాలు సమర్పిస్తారని అంచనా. తల వెంట్రుకల అమ్మకం ద్వారా దేవస్థానానికి ప్రతియేటా 24 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతున్నది.[3]

ఆరోగ్య జాగ్రత్తలు

మార్చు
  • ప్రతి ఒక్కరికి గుండు గీసే బ్లేడులో మార్పిడి

మూలాలు

మార్చు
  1. http://www.thehindubusinessline.com/life/2005/05/20/stories/2005052000170400.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-29. Retrieved 2007-12-31.
  3. http://www.hinduonnet.com/2005/02/23/stories/2005022305850300.htm[permanent dead link]