తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు

తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు 20-12-1951 వ సంవత్సరం శ్రీమతి సుగుణావతి, వేంకట శ్రీనివాసాచార్యులు దంపతులకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు.వీరి భార్య-వంగిపురం రాజ్యలక్ష్మి, వీరి కుమార్తె-రాధ వీరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు గ్రామం.

శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు
శ్రీ రాజగోపాలాచార్యులు చాయాచిత్రము
జననం
వేంకట రాజగోపాలాచార్యులు = (1951-12-20) 1951 డిసెంబరు 20 (వయసు 72)

జాతీయతభారతీయుడు
వృత్తిసంపాదకులు గోవిందప్రియ ఆధ్యాత్మిక మాసపత్రిక
క్రియాశీల సంవత్సరాలు31-12-2009 లో పదవీవిరమణ.
రచనలు విద్యార్ధి వ్యాకరణ దీపిక,*అన్న విజ్ఞానము,*విశ్వనాధ శబరి,*తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష,*యక్షప్రశ్నలు-జీవిత పరమార్ధం,*విష్ణుసహస్రనామ స్తోత్రం -లఘు వివరణ,*నేనెవరిని(స్వీయ జీవనకృతి)*భగవాన్ జగన్నాధ కధలు,*అనుభవదీపం,*అభినవకవికోకిల డా.అల్లూరి కవితా సమీక్ష,*వ్యాకరణ తత్వ దర్శనము.
తల్లిదండ్రులుతండ్రి వేంకటశ్రీనివాసాచార్యులు,తల్లి:సుగుణావతి.
బంధువులుకుమార్తె-రాధ,ద్వితీయ సొదరుడు-కీ.శే.డా.ఆచార్య తిరుమల.
ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రము నుండి సూక్తిసుధ కార్యక్రమములు,

విద్యాగురువులు మార్చు

సర్వశ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు, యస్వీ.జోగారావు, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, బొడ్డుపల్లి పురుషోత్తం ప్రభ్రుతులు.

ఆధ్యాత్మిక గురువులు మార్చు

తండ్రి వేంకట శ్రీనివాసాచార్యులు, శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీ మధుసూదన ఓఝా.

వృత్తి-ప్రవృత్తి మార్చు

భీమవరం కస్తూరిబా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా 35 సంవత్సరములు పనిచేసి 31-12-2009లో పదవీవిరమణ చేశారు. సాహిత్య ఆధ్యాత్మిక చింతన, లోక-గ్రంధముల పరిశీలన.వీరు గోవిందప్రియ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు.

  • స్థాపించిన సంస్థ: శ్రీనివాస భారతి-సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థ-1982

సాంస్కృతిక సేవ మార్చు

గ్రంథ రచనలు, ప్రచురణలు, ఆవిష్కరణలు, సాహిత్య ఆధ్యాత్మిక సభా నిర్వహణలు, పలు జాతీయ సదస్సులలో ప్రసంగాలు, జీయరు స్వాములు నిర్వహించే యజ్ఞ యాగాలలో ప్రవచనములు, గ్రంథ సమీక్షలు, పీఠికలు, రేడియో ప్రసంగాలు, పలు పురస్కారములు, జ్ఞాపికలు, ఇది అంతా సింధువులో బిందువు.

రచనలు మార్చు

  1. విద్యార్థి వ్యాకరణ దీపిక
  2. అన్న విజ్ఞానము
  3. విశ్వనాధ శబరి
  4. తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష
  5. యక్షప్రశ్నలు-జీవిత పరమార్ధం
  6. విష్ణుసహస్రనామ స్తోత్రం-లఘు వివరణ
  7. నేనెవరిని (స్వీయ జీవనకృతి)
  8. భగవాన్ జగన్నాధ కథలు
  9. అనుభవదీపం
  10. అభినవకవికోకిల డా.అల్లూరి కవితా సమీక్ష
  11. వ్యాకరణ తత్వ దర్శనము.

మూలాలు మార్చు

తిరుమల తిరుపతి దేవస్థాన మాసపత్రిక సప్తగిరిలో, భారతి సాహిత్య మాస పత్రికలో వీరి గ్రంథము అన్నవిజ్ఞానము గ్రంథముపై గ్రంథ సమీక్షలు.