1960, జనవరి 15న ఢిల్లీలో జన్మించిన తిలక్ రాజ్ (Tilak Raj) మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళి క్రికెట్ పోటీలలో బరోడా, ఢిలీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1985లో బరోడా తరఫున ఆడుతూ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతని ఓవర్‌లోనే రవిశాస్త్రి వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఇలాంటి ఘనత సాధించడం ప్రపంచంలో ఇది రెండవది కాగా భారత్ తరఫున మొట్టమొదటిది. దీనితో శాస్త్రితో పాటు ఇతని పేరు కూడా ప్రసిద్ధి చెందినది.

బయటి లింకులుసవరించు