రవిశాస్త్రి

ప్రముఖ క్రికెట్ ఆటగాడు

1962 మే 27న ముంబాయిలో జన్మించిన రవిశంకర్ జయధ్రిత శాస్త్రి (మరాఠీ : रविशंकर जयद्रिथ शास्त्री) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతితో బ్యాటింగ్, ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగల ఈ ఆల్‌రౌండర్ ఆటగాడు 18 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రారంభంలో బౌలర్‌గానే క్రీడా జీవితం ప్రారంభించిననూ తర్వాత బ్యాట్స్‌మెన్‌గా రాణించి బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా మారినాడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్ క్రికెట్లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబర్చి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్‌గా ఎన్నికైనాడు. అదే సీజన్‌లో ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన వారిలో వెస్ట్‌ఇండీస్కు చెందిన గారీ సోబర్స్ తర్వాత ఇతను రెండో వాడు మాత్రమే. టెస్ట్ క్రికెట్లో ఇతను 11 సెంచరీలు సాధించాడు, ఇందులో ఒక డబుల్ సెంచరీ (206 పరుగులు) కూడా ఉంది. టెస్ట్ మ్యాచ్‌లో ఒక్కసారి భారత జట్టుకు నేతృత్వం వహించి ఆ టెస్ట్‌ను గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో బొంబాయి (ఇప్పటి ముంబాయి) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గ్లామోర్గన్ తరఫున ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడినాడు. 31 ఏళ్ళ వయసులో మోకాలి నొప్పి వల్ల క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించాడు. 2007లో బంగ్లాదేశ్ పర్యటించిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు.

రవిశాస్త్ర్
ఆడి మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా శాస్త్రి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రవిశంకర్ జయద్రిత శాస్త్రి
పుట్టిన తేదీ (1962-05-27) 1962 మే 27 (వయసు 62)
ముంబై, మహారాష్ట్ర
ఎత్తు1.91 మీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్ం ఆర్థోడాక్స్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 151)1981 ఫిబ్రవరి 21 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1992 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 36)1981 నవంబరు 25 - ఇంగ్లండ్ తో
చివరి వన్‌డే1992 డిసెంబరు 17 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1979–1993బాంబే
1987–1991గ్లామోర్గాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే లు దేశీవాళీ క్రికెట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 80 150 245 278
చేసిన పరుగులు 3,830 3,108 13,202 6,383
బ్యాటింగు సగటు 35.79 29.04 44.00 31.12
100లు/50లు 11/12 4/18 34/66 6/38
అత్యుత్తమ స్కోరు 206 109 217 138*
వేసిన బంతులు 15,751 6,613 42,425 11,966
వికెట్లు 151 129 509 254
బౌలింగు సగటు 40.96 36.04 44.00 32.18
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 1 18 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 3 0
అత్యుత్తమ బౌలింగు 5/75 5/15 9/101 5/13
క్యాచ్‌లు/స్టంపింగులు 36/– 40/– 141/– 84/–
మూలం: Cricinfo, 2008 సెప్టెంబరు 6

రవిశాస్త్రి మంగుళూరుకు చెందిన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో ముంబాయిలో జన్మించాడు[1] ఈయన తండ్రి ఎం. జయధ్రిత శాస్త్రి వృత్తిరీత్యా వైద్యుడు[2], కుటుంబంలో చాలామంది విద్యాధికులు.[1] యుక్తవయసు వచ్చేవరకు రవిశాస్త్రి క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోలేదు. కేవలం సరదాగా ఆడేవాడు. 1974లో మాతుంగా డాన్ బాస్కో పాఠశాల తరఫున అంతర్ పాఠశాల గిల్లెస్ షీల్డ్ పోటీల్లో ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్లో సెయింట్ మేరీస్ పాఠశాల జట్టుతో ఓడిపోయాడు. సెయింట్ మేరీస్ జట్టులో ఆ తరువాత రంజీ క్రీడల్లో ఆడిన శిశిర్ హట్టాంగడి, జిగ్నేష్ సంఘానీ కూడా ఉన్నారు. ఆ మరుసటి సంవత్సరం రవిశాస్త్రి ఆధ్వర్యంలో డాన్ బాస్కో గిల్లెస్ షీల్డును గెలుచుకున్నది. ఫైనల్ ఆటలో రవిశాస్త్రి సాధించిన అత్యధిక స్కోరు రికార్డు ఆ తర్వాత 27 సంవత్సరాల వరకు అవిచ్ఛిన్నంగా నిలిచింది.[3]

ఇవి కూడా చూడండి

మార్చు


మూలాలు

మార్చు