తీగెల శేషారావు ప్రముఖ రంగస్థల నటులు.

రంగస్థల ప్రస్థానం మార్చు

శేషారావు తల్లిదండ్రులు నంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు. సంగీతంలో చాలా కృషి చేశారు. అంతేకాకుండాశేషారావు మామగారు చదలవాడ నుబ్బయ్య ఫిడేల్ వాయిద్యకారులు. అలా శేషారావుకి నాటకరంగంపై ఇష్టం కలగడానికి గృహవాతావరణం కూడా బాగా తోడ్పడింది. మహాగాయకరత్న, సంగీత విద్వాన్ మహావాది వెంకటప్పయ్యగారి సలహాలు, ఆశీస్సులతో నాటకరంగంలో గుర్తింపు పొందారు.

తొలినాళ్లలో చేబ్రోలు, ముట్లూరి మొదలైనవారి నాటక సమాజాల వారు ప్రదర్శించే సాంఘిక నాటకాలలో వివిధ పాత్రలు ధరించారు. ఆ తరువాత పౌరాణిక నాటకాలలోకి వచ్చారు. హరిశ్చంద్ర నాటకంలో "వీరబాహుడు" పాత్రద్వారా మొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేశారు. చేబ్రోలు హైస్కూలు నాటకం కృష్ణరాయబారం లో భీముని పాత్ర ధరించి ప్రశంసలు పొందారు. పరాశరం లక్ష్మయ్యనూరి, నన్నపనేని వీరయ్యలు శేషారావు ప్రోత్సహించారు. చేబ్రోలు గాంధీ నాట్యమండలి, గుంటూరు స్టార్ థియేటర్, గుంటూరు రిక్రియేషన్ క్లబ్, తెనాలి ఆంధ్రా ఆర్టిస్టు అసోసియేషన్ మొదలైన సమాజాలలో భీముడు, యముడు, పాపారాయుడు, విశ్వామిత్రుడు, ఘటోత్కచుడు మొదలైన పాత్రలు ధరించారు. పీసపాటి వారి సమాజంలో 15 సంవత్సరాలు పనిచేశారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలో నటుడుగా పాల్గొన్నారు.

నటించిన నాటకాలు - పాత్రలు మార్చు

  1. హరిశ్చంద్ర - వీరబాహుడు
  2. కృష్ణరాయబారం - భీముడు
  3. - యముడు
  4. - పాపారాయుడు
  5. - విశ్వామిత్రుడు
  6. - ఘటోత్కచుడు
  7. - కుంభకరుడు
  8. - కీచకుడు

సన్మానాలు - సత్కారాలు మార్చు

మూలాలు మార్చు

  • తీగెల శేషారావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 280.