చేబ్రోలు

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా గ్రామం, మండలకేంద్రం

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామం. ఇదే పేరుతో గల మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3110 ఇళ్లతో, 11626 జనాభాతో 2126 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5728, ఆడవారి సంఖ్య 5898. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1040 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 734. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590307[1].చేబ్రోలు, గుంటూరు - చీరాల రాష్ట్ర రహదారిపై ఉంది.

చేబ్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
చేబ్రోలు లోని నాగేశ్వరాలయం
చేబ్రోలు లోని నాగేశ్వరాలయం
చేబ్రోలు లోని నాగేశ్వరాలయం
చేబ్రోలు is located in Andhra Pradesh
చేబ్రోలు
చేబ్రోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′55″N 80°31′35″E / 16.198670°N 80.526388°E / 16.198670; 80.526388
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చేబ్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,546
 - పురుషుల సంఖ్య 5,392
 - స్త్రీల సంఖ్య 5,154
 - గృహాల సంఖ్య 2,551
పిన్ కోడ్ 522212
ఎస్.టి.డి కోడ్ 08644

గణాంకాలు మార్చు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 10546, పురుషుల సంఖ్య 5392, మహిళలు 5154, నివాసగృహాలు 2551, విస్తీర్ణం 2126 హెక్టారులు

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

ఇది జైనులు అభివృద్ధి చేసిన గ్రామం. జైనప్రోలు అనే పేరు చేబ్రోలు గా మారిందని అంటారు.

 
చేబ్రోలులో ఉన్న గుడి  చిత్రం

గ్రామనామ వివరణ మార్చు

చేబ్రోలు అనే గ్రామనామం కొత్తరాతియుగం నాటి ప్రాక్తన చారిత్రిక దశకు చెందినది. ఆ బృహత్ శిలాయుగంలో రాగి, ఇనుము వంటి లోహాలు కనుగొని లోహపరిశ్రమ ప్రారంభించిన విషయాలను సూచించే గ్రామనామాల్లో చేబ్రోలు కూడా ఒకటి అని పరిశోధకులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రాగి లేక ఇత్తడి పాత్రను చెంబు అంటారు. భాషావేత్తలు ఈ కారణంగా చెం అనే పదం సంస్కృతంలోని తామ్రకు సమానం. ఈ నేపథ్యంలో చేబ్రోలు అన్న పేరు కొత్తరాతియుగంలో రాగి లేక ఇత్తడి పనివాళ్లను ఆధారం చేసుకుని ఏర్పడిందని భావిస్తున్నారు.[2]

సమీప గ్రామాలు మార్చు

గ్రామ చరిత్ర మార్చు

పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శాసనాలు, పురాతన నాణేలు లభ్యమైనవి. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు, కాకతీయ సామ్రాజ్యములలో ప్రాంతీయ దుర్గంగా ఉంది. చేబ్రోలుకు పూర్వము చింతామణిపురము, తామ్రపురం, జయవోలు, శంభోలు అనే పేర్లు ఉన్నాయి. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరుపుట్టింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమైనవి. యుద్ధమల్లుని విజయవాడ శాసనములో చేబ్రోలు యొక్క ప్రస్తావన ఉంది.[3] కాకతీయుల కాలములో చేబ్రోలు ప్రసిద్ధి చెందినది. కాకతీయుల సేనాని, నృత్యరత్నావళి రచించిన జాయప సేనాని చేబ్రోలు దుర్గాన్ని పాలించాడు.పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లు ప్రసిద్ధి. అందువలన చేబ్రోలును "చిన్న కాశీ" అని పిలిచేవారని నానుడి. కొన్ని గుళ్ళు కాలగర్భాన కలిసి పోయాయి.

భారత దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర మార్చు

భారత దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో చేబ్రోలుక ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఈ పోరాటంలో గ్రామానికి చెందిన 48 మంది పాల్గొని, చెరసాలపాలయ్యారు. వీరిలో 15 మంది మహిళలు. వారు:- శ్రీమతి వాసిరెడ్డి పార్వతమ్మ శ్రీమతి పాటిబండ్ల పార్వతమ్మ గోళ్ళమూడి రత్తమ్మ వాసిరెడ్డి నాగమ్మ సూర్యదేవర అన్నపూర్ణమ్మ వాసిరెడ్డి హనుమాయమ్మరేవెళ్ళ వెంకాయమ్మ పాటిబండ్ల అన్నపూర్ణమ్మ వాసిరెడ్డి అఖిలాండమ్మ సూర్యదేవర హైమావతమ్మ జాగర్లమూడి హనుమాయమ్మ సూర్యదేవర పెద్ద రాజ్యలక్ష్మమ్మ సూర్యదేవర చిన్న రాజ్యలక్ష్మమ్మ చెరుకూరి సీతారామమ్మదేవభక్తుని లక్ష్మీ తులశమ్మ ఆ కాలంలో, ఒక గ్రామం నుండి 15 మంది మహిళలు ఉద్యమంలో పాల్గొనడం అనే కీర్తి, చేబ్రోలు గ్రామానికే దక్కింది. గాంధీజీ చూపిన బాటలో నడచిన మహిళలు, ప్రజలలో చైతన్యం తీసికొని రావడానికి, అంటరానితన నిర్మూలన, వితంతువులకు విద్యాబోధన వంటి కొన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. గాంధీజీ పై అభిమానంతో ఈ గ్రామ ప్రజలు, ఆయన మరణానంతరం, గ్రామంలోని బ్రహ్మదేవాలయం సమీపంలోని మండపంలో ఆయన చిత్రపటాన్ని ఉంచి పూజలు చేసేవారు.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.

సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాల మార్చు

చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల 2008లో స్థాపించారు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మార్చు

ఈ కళాశాలలో 2015, ఆగష్టూ-29వ తేదీనాడు సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ కళాశాలలో బి.ఏ.రెండవ సంవత్సరం చదువుచున్న కరుణకుమారి అను విద్యార్థిని, ఇటీవల గుంటూరులో నిర్వహించిన 35వ అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని, హ్యామర్ థ్రో, జావెలిన్ థ్రోలో ప్రథమస్థానం, షాట్ పుట్ లో ద్వితీయస్థానం కైవసం చేసుకున్నది. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో అంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని, హ్యామర్ థ్రోలో స్వర్ణ పతకం స్వంతం చేసుకున్నది. ఈ విజయాలను సాధించిన ఈమె, 2016, ఫిబ్రవరిలో శ్రీలంక దేశంలో నిర్వహించు అంతర్జాతీయ క్రీడాపోటీలలో భర్తదేశం తరఫున పాల్గొనడానికి అర్హత సాధించింది. శ్రీలంకలోని రాజపక్సే స్టేడియంలో 2016, ఫిబ్రవరి-27,28 తేదీలలో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్న ఈమె, 5కె.హెచ్.వాకర్స్ పోటీలలో ప్రథమస్థానం, హ్యామర్ థ్రోలో తృతీయస్థానం సంపాదించింది.

శ్రీ సూర్యదేవర నరసయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

దేశ, విదేశాలలో ఉంటున్న ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి, ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుచున్నారు. [12] ఈ పాఠశాల 75వ వార్షికోత్సవాలను డిసెంబరు/2017 లో ఒక వారంరోజులపాటు నిర్వహించెదరు.

ప్రాథమిక పాఠశాల మార్చు

చేబ్రోలులోని చీలుపాలెంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో, 78 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు ఏకరూపదుస్తులు ధరించుచున్నారు. పాఠశాల వేళలు సక్రమంగా పాటించుచున్నారు. నీతి పద్యాలు చెబుతారు. ఈ పాఠశాలలో మద్యాహ్న భోజనం బాగా పెడుచున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుచున్నారు. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా విద్యాప్రమాణాలు మెరుగుపరచారు. ప్రతి విద్యార్థిపట్లా ప్రత్యేకశ్రద్ధ తీసికొనుచున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతోపాటు, గ్రామస్థుల ప్రోత్సాహం గూడా తోడవటంతో, డివిజనులోనే ఉత్తమ పాఠశాలల పోటీకి ఎంపికైనది. తెనాలి డివిజనులోని 11 మండలాలలో ఉత్తమ పాఠశాలలుగా మూడు పాఠశాలలను ఎంపిక చేయగా, అందులో ఈ పాఠశాల ఒకటి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

చేబ్రోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో23 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 10 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 11 మంది, నలుగురు నాటు వైద్యులు ఉన్నారు. 12 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. ఘన వ్యర్ధాల ప్లాంట్:-ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, ఈ ప్లాంట్ నిర్మాణంలో ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

చేబ్రోలులో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు (భారతీయ స్టేట్ బ్యాంక్), సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

చేబ్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 483 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 55 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1588 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 284 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1304 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

చేబ్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1194 హెక్టార్లు. చేబ్రోలుకు సమీపము ఉన్న బకింగ్‌హాం కాలువ నీటిపారుదలకు ఉపయోగపడుతోంది.
  • బావులు/బోరు బావులు: 110 హెక్టార్లు

ఇతర మౌలిక వసతులు మార్చు

పోలీసు స్టేషను మార్చు

ఈ గ్రామంలో నూతనంగా మంజూరుచేసిన మోడల్ పోలీసు స్టేషనుకు 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కార్యాలయ భవనానికి, 2017, ఆగస్టు-27న శంకుస్థాపన నిర్వహించెదరు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మార్చు

గోశాల మార్చు

ఈ గ్రామంలో గోవులను సంరక్షించడానికి రావులమ్మ తల్లి దేవస్థానం సమీపంలో, విశ్రాంత ఉద్యోగి టి.రమేష్ చంద్ర, స్థానికుల సహకారంతో, 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఒక గోశాలను 2015, డిసెంబరు-7వ తేదీనాడు ప్రారంభించెదరు.

గ్రామ రాజకీయాలు మార్చు

ఈ గ్రామం, పొన్నూరు శాసనసభ నియోజక వర్గంలో భాగంగా ఉంది.

గ్రామ పంచాయతీ మార్చు

2022 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అతోట వినీత రాణి, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా చౌడయ్య ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

 
చతుర్ముఖ బ్రహ్మ ఆలయం - దీన్ని 19 వ శతాబ్దిలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించాడని ప్రతీతి
  • భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో ఒకటైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం చేబ్రోలులో ఉంది. ఇక్కడి బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 19వ శతాబ్ది ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని ప్రతీతి.
  • శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం.
  • శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.
  • శ్రీ సహస్రలింగేశ్వరస్వామివారి ఆలయం

పైన పేర్కొన్న పంచాలయాలలో, ధ్వజస్తంభాల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-14, ఆదివారం నుండి ప్రారంభించారు. ఆదివారంనాడు ప్రత్యేకపూజలు, గ్రామోత్సవం, సోమ, మంగళవారాలు ప్రత్యేక హోమాలు నిర్వహించి, 17వ తేదీ బుధవారంనాడు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని, సాంప్రదాయంగా, ఆడబడుచులకు పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాలలో ఉంటున్న ఆడపిల్లలను ఈ కార్యక్రమానికి గ్రామానికి ఆహ్వానించారు. వారు ఇంటిల్లిపాదీ తరలివచ్చారు. వారిరాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమాలలో భాగంగా, 15,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదవితరణ నిర్వహించారు.

ఇతర ఆలయాలు మార్చు

  • శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామి దేవాలయం:- ఈ ఆలయ గాలిగోపురం, విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జూలై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు.
  • చేబ్రోలు గొల్లపాలెంలో నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, 2014, మార్చి-9న, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సుమారుగా 2 లక్షల రూపాయల నగదును ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా, 5 వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
  • చేబ్రోలు గ్రామంలో బ్రహ్మ దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, 2014, మే-18 నుండి 26 వరకు నిర్వహించెదరు.
  • శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి గ్రామస్థులు శ్రీ పాటిబండ్ల లక్ష్మీనరసింహారావు కుటుంబసభ్యులు, స్వామివారికి ఒక లక్ష రూపాయల విలువైన ఉత్సవ విగ్రహాలను సమర్పించారు. ఈ ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో మూడు రోజులు ప్రత్యేకపూజలు, అభిషేకాలు, నిర్వహించారు. ఈ ఉత్సవ విగ్రహాలతో, 8వతేదీ బుధవారంనాడు, స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయం ఆలయంలో ఆలయంలో శ్రీరంగనాథ భజన మండలీ వారు కోలాట, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
  • శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం:- స్థానిక సాలిపేటలో నెలకొన్న ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-13వ తేదీ శనివారంనాడు, స్వామివారి వార్షిక కళ్యాణమహోత్సవం కన్నులపండువగా సాగినది. ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామం నుండియేగాక, పరిసర ప్రాంతాలనుండి గూడా అధికసంఖ్యలో తరలి వచ్చి, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.
  • శ్రీ ఆదికేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నూతన గాలిగోపుర నిర్మాణానికీ, విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జూలై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. ఈ ఆలయంలో 2017, మార్చి-11వతేదీ శనివారంనాడు, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
  • శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జూలై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు.
  • శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండియే భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో దేవాలయాన్ని ప్రత్యేకంగా, సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసారు.
  • శ్రీ సహస్రలింగేశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం చేబ్రోలు కొమ్మమూరు కాలువ వంతెన సమీపంలోని కాలువకట్టపై నెలకొన్నది.
  • శ్రీభక్తాంజనేయస్చ్వామివారి ఆలయం:- చేబ్రోలు గ్రామంలోని ఈ ఆలయంలో 2016, మార్చి-5వ తేదీ శనివారంనాడు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సంప్రోక్షణ, మహాకుంభాభిషేకాలు, 108 కలశాలతో పూజాకార్యక్రమం, శాంతిహోమాలు, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రెండువేలమందికి పైగా భక్తులకు అనందానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
  • ఆదిశంకర మఠం.
  • ఇక్కడి ప్రాచీన దేవాలయాలను గుప్త నిధుల కోసం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కూలగొట్టించాడని, తిరిగి కట్టించాడనీ వదంతి.

గ్రామ ప్రముఖులు మార్చు

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:పేజీ.26
  3. Brāhmanism, Jainism, and Buddhism in Āndhra Dēśa By P. Arundhati పేజీ.72 [1]

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=చేబ్రోలు&oldid=4047158" నుండి వెలికితీశారు