భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది[2].[3] అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటుంటారు తీహార్ జైలు, దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఢిల్లీ లోని చాణక్యపురి నుండి 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెఱసాల అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయమిచ్చింది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని కూడ పేరు పొందింది.[4]

తీహార్
తీహార్ జైలు is located in ఢిల్లీ
తీహార్ జైలు
Location in Delhi
తీహార్ జైలు is located in India
తీహార్ జైలు
తీహార్ జైలు (India)
LocationTihar Village, New Delhi, India
Coordinates28°37′03″N 77°06′02″E / 28.61750°N 77.10056°E / 28.61750; 77.10056
StatusOperating
Security classMaximum
Capacity10,026
Population17,534 [1] (as of 31 December 2019)
Opened1957
Managed byDepartment of Delhi Prisons, Government of Delhi

ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది.

ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో వుంచ బడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు. పన్నేండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డవారిలో కీలక నిందితుడు అఫ్జల్‌ గురును శనివారం ఇక్కడే ఉరితీశారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు.

1986 మార్చి 16న క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయినా మళ్లీ దొరికిపోయాడు. అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో పదేళ్లు అదనపు శిక్ష పడింది. అస్సాం మాజీ విద్యాశాఖామంత్రి రిపున్‌ బోరా డానియల్‌ టాప్‌నో హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2008 జూన్‌ 3న సిబిఐ బోరాను అరెస్టు చేసి ఇదే జైలుకు తరలించారు. డిఎంకె ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, ఎం.కె.కనిమొళి, వినోద్‌ గోయంకా, షాహిద్‌ బల్వా, సంజయ్‌ చంద్రా లను 2జీ కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు.

ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్‌ కల్మాడీని 2010లో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎర చూపి ఎంపిలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్‌ వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇదే జైలులో ఉండాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు. హర్యాన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతలా, అతని కుమారుడు అజయ్‌ చౌతలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు.

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dept అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. Tihar prison in India: More dovecote than jail. The Economist (2012-05-05). Retrieved on 2012-05-31.
  3. "Department of Tihar Prisons". Government of Delhi. Archived from the original on 2014-01-08. Retrieved 2014-01-08.
  4. "Now, a Tihar Idol". 10 June 2012. Archived from the original on 2013-01-26. Retrieved 2014-05-30.

ఇతర లింకులు

మార్చు

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')