తుంబా భూమధ్యరేఖీయ రాకెట్ ప్రయోగ కేంద్రం

 

తుంబా భూమధ్యరేఖీయ రాకెట్ ప్రయోగ కేంద్రం
దస్త్రం:Rohini rocket.jpg
తుంబా నుండి RH-300 Mk2 రాకెట్ ప్రయోగం
స్థలంతుంబా, తిరువనంతపురం, కేరళ
పొట్టి పేరుTERLS
ఆపరేటరుఇస్రో
ప్రయోగ వేదిక(లు)One

తుంబా భూమధ్యరేఖీయ రాకెట్ ప్రయోగ కేంద్రం (ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్) (TERLS) [1] 1963 నవంబరులో భారతదేశం స్థాపించిన అంతరిక్ష నౌకా ప్రయోగ కేంద్రం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) దీన్నినిర్వహిస్తోంది. ఇది కేరళ, తిరువనంతపురం లోని తుంబాలో ఉంది. ఇది భారత భూభాగపు దక్షిణ కొనకు సమీపంలో, అయస్కాంత భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉంది. ఇది తిరువనంతపురం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం. [2] ఇస్రో ప్రస్తుతం దీన్ని సౌండింగ్ రాకెట్లను ప్రయోగించడానికి ఉపయోగిస్తోంది. [1]

తొలుత, రాకెట్‌లను పూర్వపు సెయింట్ లూయిస్ హై స్కూల్‌లో నిర్మించేవారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో అంతరిక్ష మ్యూజియంను ఏర్పాటు చేసారు. [3] స్థానిక బిషప్ రెవ. పీటర్ బెర్నార్డ్ పెరీరా, త్రివేండ్రం బిషప్ అయిన విన్సెంట్ విక్టర్ డెరీరే (బెల్జియన్), జిల్లా కలెక్టర్ మాధవన్ నాయర్‌లు తీరప్రాంత సమాజం నుండి 600 ఎకరాల భూమిని సేకరించడంలో కీలకపాత్ర పోషించారు. [4] బిషప్ రెవ. పెరీరా, APJ అబ్దుల్ కలాం శాస్త్రీయ కార్యకలాపాల కోసం స్థానిక చర్చిలోని ప్రార్థనా మందిరాన్ని, బిషప్ గదినీ ఇచ్చాడు. [5] ఈ ప్రాజెక్టుకు ఢిల్లీలో ఎదురైన బ్యూరోక్రాటిక్ అడ్డంకులను సుగమం చేయడంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి లక్ష్మీ ఎన్. మీనన్ చాలా సహాయపడింది. [6] HGS మూర్తి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషనుకు మొదటి డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. [7]

ఇక్కడి నుండి ప్రయోగించిన సౌండింగ్ రాకెట్ వ్యవస్థలను NASA నుంచి అప్పు తెచ్చుకున్నారు. పేలోడును ఫ్రాన్సుకు చెందిన CNES అందించింది. ఈ కేంద్రపు స్థాపన గురించిన వార్త, స్థాపన తేదీకి మరుసటి రోజు జరిగిన జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య కారణంగా ప్రపంచ మీడియా దృష్టిని పొందలేకపోయింది.

స్థానం మార్చు

తుంబా [8] 8°32'34" ఉత్తర అక్షాంశం, 76°51'32" తూర్పు రేఖాంశాల వద్ద ఉంది. తక్కువ-ఎత్తు వద్ద చేసే అధ్యయనాలకు, ఎగువ వాతావరణం, అయానోస్పియర్ అధ్యయనాలకూ ఈ స్థలం అనువైనది. పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి చాలా దూరంలో ఉన్న ప్రదేశాలలో తుంబా కూడా ఒకటి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Sounding Rockets - ISRO". www.isro.gov.in. Archived from the original on 2019-12-11. Retrieved 2019-09-11.
  2. "Forty years in Space". www.rediff.com. India Abroad. Retrieved 10 May 2016.
  3. "Transported on a Bicycle, Launched from a Church: The Amazing Story of India's First Rocket Launch". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-08. Retrieved 2019-09-04.
  4. ICM, Team (2019-07-23). "When ISRO Aimed For the Heavens, a Tiny Church in Kerala Said Amen!". Indian Catholic Matters (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-26.
  5. "Dr. A.P.J. Abdul Kalam: Former President of India: Speeches : Details". abdulkalam.nic.in. Retrieved 2020-10-26.
  6. "Remembering the guiding light". www.deccanchronicle.com. Archived from the original on 2020-10-28. Retrieved 2020-10-26.
  7. "I'm proud that I recommended him for ISRO: EV Chitnis".
  8. Ley, Willy (June 1964). "Anyone Else for Space?". For Your Information. Galaxy Science Fiction. pp. 110–128.