తుమ్మిడిహట్టి ప్రాజెక్టు

బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును ప్రాణహిత నదిపై నిర్మిస్తున్నారు. గతంలో తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రూపురేఖలను మార్చినపుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ప్రాజెక్టు ఉనికి లోకి వచ్చింది. కొమరంభీం జిల్లా, కౌటాల మండలం, తుంబడిహట్టి (తుమ్మిడిహట్టి) వద్ద ప్రాణహిత నదిపై 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణం ఈ ప్రాజెక్టులోని ప్రధానమైన భాగం. వార్ధా, పెన్‌గంగ నదులు సంగమించి ప్రాణహిత నదిగా రూపొందే స్థలం వద్ద ఈ బ్యారేజీని నిర్మిస్తారు. నిల్వ సామర్థ్యం 1.8 టీఎంలు. సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.[1]

ఆంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
అధికార నామండా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
ప్రాణహిత నది

ఈ ప్రాజెక్టు స్థలాన్ని 200 మీటర్లు ఎగువకు జరిపి వార్ధా నదిపై నిర్మించాలని ఒక ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది.[2]

రూపకల్పన

మార్చు

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. Babu, Patan Afzal (2018-07-24). "Tummidhihatti tweak brings down Kaleshwaram cost". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-14.