తులసి నాయర్, భారతీయ సినీ నటి. ఆమె తమిళ సినిమాల్లో నటించింది. 2013లో మణిరత్నం దర్శకత్వంలో కడలి సినిమాతో తెరంగేట్రం చేసింది తులసి. ఆ తరువాత రవి కె.చంద్రన్ దర్శకత్వంలో యాన్ (2014) సినిమాలో నటించింది.

తులసి నాయర్
60వ దక్షిణాది ఫిలింఫెర్ అవార్డ్స్ వెదుకలో తులసి నాయర్
జననం20 అక్టోబరు 1997
వృత్తినటి, మొడల్
క్రియాశీల సంవత్సరాలు2013-2014
తల్లిదండ్రులురాధ
బంధువులుకార్తికా నాయర్(సోదరి)

కెరీర్

మార్చు

తన 14వ ఏట తులసి మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 2011 నవంబరు లో సుహాసిని సిఫార్సుపై తులసిని ఎంచుకున్నాడు మణి రత్నం.[1] ఈ పాత్రకు ఆమె చిన్నది అవుతుందన్న కారణంతో మొదట మణి  రత్నం ఆమెను తిరస్కరించారు. కానీ ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడంతో సహాసినీ సిఫార్సుపై తులసిని తిరిగి తీసుకున్నాడు మణి.[2]  ఈ సినిమా కథానాయకుడు గౌతం కార్తిక్, తులసిలకు మొదటి సినిమా. నిజానికి 32 ఏళ్ళ క్రితం గౌతం తండ్రి కార్తిక్, తులసి తల్లి రాధ హీరో  హీరోయిన్లుగా కలసి తమ మొదటి సినిమాలో నటించడం విశేషం. 

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2013 కడల్ బేత్రికా తమిళము కడలి గా తెలుగులోకి

అనువదించబదినది

2014 యాన్ స్రీలా తమిళం రంగం 2 గా తెలుగులొకి

అనువదించబదినది

మూలాలు

మార్చు
  1. V., Lakshmi (14 నవంబరు 2011). "Mani's search continues…". The Times of India. Retrieved 14 ఆగస్టు 2014.
  2. "If not for Mani Ratnam, I wouldn't be in films: Thulasi". The Times of India. 29 సెప్టెంబరు 2012. Retrieved 14 ఆగస్టు 2014.