తెన్‌కాశి జిల్లా

తమినాడులోని జిల్లా

తెన్‌కాశి జిల్లా లేదా తెన్కాసి జిల్లా, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాల్లో ఇది ఒకటి. దీనిని 2019 నవంబరు 22న న తిరునల్వేలి జిల్లా నుండి వేరు చేసారు. తమిళనాడు ప్రభుత్వం దానిని 2019 జూలై 18న ప్రకటించింది. జిల్లా ప్రధాన కేంద్రం తెన్కాసి పట్టణం.

తెన్‌కాశి జిల్లా
Tenkasi District
కుట్రలం జలపాతం, తెన్‌కాశి జిల్లా
కుట్రలం జలపాతం, తెన్‌కాశి జిల్లా
తమిళనాడు
దేశం భారతదేశం
తమిళనాడుతమిళనాడు
అతిపెద్ద నగరంతెన్‌కాశి
స్థాపించబడింది2019 నవంబరు 22
Seatతెన్‌కాశి
విస్తీర్ణం
 • Total2,916.13 కి.మీ2 (1,125.92 చ. మై)
జనాభా
 • Total14,07,627
 • జనసాంద్రత480/కి.మీ2 (1,300/చ. మై.)
భాషలు
 • ప్రాంతంతమిళం , మలయాళం
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationTN76 and TN76A and TN79

భౌగోళికం

మార్చు

ఈ జిల్లా దక్షిణాన తిరునల్వేలి జిల్లా, ఉత్తరాన విరుదునగర్ జిల్లా, తూర్పున తూత్తుకుడి జిల్లా, పశ్చిమాన కేరళలోని కొల్లం పతనమిట్ట జిల్లాల సరిహద్దులతో ఉంది.

గణాంకాలు

మార్చు
మతాల ప్రకారం తెన్కాశి జిల్లా జనాభా 2011 [2]
మతం శాతం
హిందూ
  
83.66%
ముస్లిం
  
9.91%
క్రిష్టియన్లు
  
6.31%
మతం తెలపనివారు
  
0.12%
మతాల ప్రకారం

2011 జనాభా లెక్కల ప్రకారం, తెన్కాసి జిల్లా జనాభా 1,384,937. జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 20.23% మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల జనాభా 0.25% ఉన్నారు. 42.75% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.తమిళం ప్రధాన భాష. 2011 జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో 95% మంది తమిళం, 5% మంది మలయాళం మాట్లాడతారు.

పరిపాలన

మార్చు
 
తెన్‌కాశి జిల్లా లోని తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ మోనోక్రోమ్

శివగిరి, శంకరన్‌కోవిల్, వీరకేరళంపుత్తూరు, అలంగుళం, తెన్‌కాసి షెంకోట్టై అనే 6 తాలూకాల నుండి తెన్‌కాశి ఏర్పడింది. ఆ తర్వాత మరో రెండు తాలూకాలు సృష్టించబడ్డాయి: కడయనల్లూరు, తిరువెంగడం.

రాజకీయాలు

మార్చు

తెన్కాసి అసెంబ్లీ నియోజకవర్గం తెన్కాసి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. తెన్కాసి తమిళనాడులోని లోక్‌సభ (భారత పార్లమెంటు) నియోజకవర్గం. ఈ సీటు వెనుకబడిన కులాలకు కేటాయించబడింది.

పార్లమెంటరీ నియోజకవర్గం

మార్చు
వ.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వు చేసిన వివరాలు
(ఎస్సీ / ఎస్టీ / ఏదీ లేదు)
1 లోక్‌సభ తెన్కాసి ఎస్సీ

తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు
వ.సంఖ్య నియోజకవర్గ పేరు రిజర్వు వివరాలు
(ఎస్సీ / ఎస్టీ / ఏదీ లేదు)
1 శంకరంకోవిల్ ఎస్సీ
2 వాసుదేవనల్లూర్ ఎస్సీ
3 కడయనల్లూర్ ఏదీ లేదు
4 తెన్కాసి ఏదీ లేదు
5 అలంగులం ఏదీ లేదు

మూలాలు

మార్చు
  1. 8 தாலுகாக்களுடன் உதயமானது தென்காசி மாவட்டம். News7 Tamil. 22 November 2019. Retrieved 30 November 2019.
  2. "Census of India - Religion". census.gov.in.

వెలుపలి లంకెలు

మార్చు