తెలంగాణ గ్రామీణ బ్యాంకు

తెలంగాణ గ్రామీణ బ్యాంకు 2014 అక్టోబరులో ఏర్పడిన ప్రభుత్వరంగ బ్యాంకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మార్చి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ను ఏర్పరిచారు.

నేపధ్యముసవరించు

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు గ్రామీణ బ్యాంకును ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తూ కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అలోక్ టాండన్ 2014 అక్టోబరు 21 సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దక్కన్ గ్రామీణ బ్యాంకు కింద ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలుండేవి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం 1976 (21/1976) లోని సబ్ సెక్షన్ (1) (4) ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణ చేస్తూ తెలంగాణకు ప్రత్యేకంగా గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లుగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు స్థానంలో.. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది[1].

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు