తెలంగాణ జిల్లాలు (అవిభక్త ఆంధ్రప్రదేశ్)
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో 13 జిల్లాలు వుండేవి.
జనాభా
మార్చు2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా[1], 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది.
జిల్లాల వారీగా జనాభా క్రింది విధంగా ఉంది.
జిల్లా పేరు | 2001 ప్రకారం జనాభా | 2001 ప్రకారం స్థానం | 2011 ప్రకారం జనాభా | 2011 ప్రకారం స్థానం |
---|---|---|---|---|
ఆదిలాబాదు జిల్లా | 2488003 | 9 | 2737738 | 9 |
కరీంనగర్ జిల్లా | 3491822 | 4 | 3811738 | 4 |
నిజామాబాదు జిల్లా | 2345685 | 10 | 2552073 | 10 |
వరంగల్ జిల్లా | 3246004 | 6 | 3522644 | 5 |
ఖమ్మం జిల్లా | 2578927 | 8 | 2798214 | 8 |
మెదక్ జిల్లా | 2670097 | 7 | 3031877 | 7 |
రంగారెడ్డి జిల్లా | 3575064 | 2 | 5296396 | 1 |
హైదరాబాదు జిల్లా | 3829753 | 1 | 4010238 | 3 |
మహబూబ్ నగర్ జిల్లా | 3513934 | 3 | 4042191 | 2 |
నల్గొండ జిల్లా | 3247982 | 5 | 3483648 | 6 |