తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం రూపొందించిన అధికారిక మొబైల్ యాప్.
తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్, అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం రూపొందించిన అధికారిక మొబైల్ యాప్.[1] రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్‌లో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.[2]
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ |
---|---|
ప్రారంభ విడుదల | 11 మే 2022 |
ఆపరేటింగ్ సిస్టం | ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, యుఎస్ఎస్‌డి |
రకం | ఆరోగ్యం |
లైసెన్సు | ఫ్రీవేర్, యాజమాన్యం |
ప్రారంభం
మార్చు2022 మే 11న మెదక్ జిల్లా, నార్సింగిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపి జి. రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3][4]
సేవలు
మార్చు- వ్యక్తిగత ఆరోగ్య వివరాలు తెలుసుకోవడం
- వైద్య పరీక్షల వివరాలు, రిపోర్టులను డౌన్‌లోడ్ చేసుకోవడం
- దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖాన వివరాలు తెలుసుకోవడం
- పరీక్షలను బట్టి అందుబాటులో ఉన్న దవాఖానను ఎంచుకోవడం
- వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశా సిబ్బంది, ఆసుపత్రుల సేవలపై వివరాలు తెలుసుకోవడం
- అభిప్రాయాన్ని నమోదు చేయడం
- వైద్యసేవలపై అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేయడం
- జరుగుతున్న వైద్య పరీక్షల స్టేటస్ తెలుసుకోవడం
మూలాలు
మార్చు- ↑ "Govt app for free diagnostic tests". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
- ↑ telugu, NT News (2022-05-12). "అరచేతిలో ఆరోగ్యం". Namasthe Telangana. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
- ↑ "Telangana News: అరచేతిలో ఆరోగ్య సమాచారం". EENADU. 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
- ↑ Shanker, K. Shiva (2022-05-11). "Simply app-surd! Newly-launched app not available for download". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-12.