సబితా ఇంద్రారెడ్డి

పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు. రంగారెడ్డి జిల్లా రాజకీయ నేతలలో ముఖ్యురాలు. 2000, 2004లలో చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 2009, 2018లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందింది.[3][4] ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2019 లో టీఆర్ఎస్ పార్టీలో చేరింది.

సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి


విద్యాశాఖ మంత్రి
తెలంగాణ ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 సెప్టెంబరు 2019

హోంశాఖ, జైలు శాఖామంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం[1]
పదవీ కాలం
2009 – 2013

శాసనసభ్యురాలు చేవెళ్ళ
పదవీ కాలం
2000 – 2009

గనుల శాఖామంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
2004 – 2009

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 డిసెంబరు 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1963-05-05) 1963 మే 5 (వయసు 60)
కోటబాస్పల్లి, వికారాబాదు జిల్లా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మాజీ మంత్రి, స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి
సంతానం 3 కుమారులు[2]
నివాసం హైదరాబాదు, భారతదేశం

జననం సవరించు

సబిత 1963, మే 5న జి. మహిపాల్ రెడ్డి, వెంకటమ్మ దంపతులకు వికారాబాదు జిల్లా, కోటబాస్పల్లి గ్రామంలో జన్మించింది.[5]ముగ్గురు తోబుట్టువులలో పెద్దది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక సోదరుడు ఉన్నారు. తాండూరులో మిడిల్ స్కూల్ వరకు చదివి, ఆపై ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. చాదర్‌ఘాట్‌లోని భాగ్య మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకుంది. శ్రీవాణి మహిళా డిగ్రీ కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తి చేసింది.

వ్యక్తిగత జీవితం సవరించు

ఎన్‌టి రామారావు క్యాబినెట్‌లో హోంమంత్రిగా ఉన్న పి. ఇంద్రారెడ్డి (1954–2000) ని తన 20 సంవత్సరాల చిన్న వయస్సులో వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కాలేజీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు తన బంధువు ద్వారా ఇంద్రారెడ్డిని కలిసింది. రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తరువాత, సబితా తన 5 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించింది.

రాజకీయ ప్రస్థానం సవరించు

భర్త, మాజీ మంత్రి పి. ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలోకి ప్రవేశించింది. 2004లో కూడా చేవెళ్ళ నుంచి నెగ్గిన సబిత నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గంను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది, భారత దేశంలోనే తొలి మహిళ హోం మంత్రి గా చరిత్ర సృష్టించింది.[6]

2014లో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై గెలుపొందింది. 2019, మార్చి 14న టిఆర్ఎస్ పార్టీలో చేరింది.[7][8] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఆమెకు విద్యాశాఖ ను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ మంత్రిగా చరిత్ర సృష్టించింది.[9][10][11][12]

కేసులు సవరించు

దాల్మియా సిమెంటు కేసులో సబిత పేరును సీబీఐ చార్జిషీటులో ఏ4గా పేర్కొనడంతో రాజీనామా చేయగా 2013 మే 25న గవర్నర్ రాజీనామా ఆమోదించారు.

మూలాలు సవరించు

  1. Sakshi (26 November 2018). "ఆమె రాష్ట్రానికి హోం మినిస్టర్". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  2. Mana Telangana (20 March 2019). "Sabitha Indra reddy son Karthik Reddy joins TRS". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  3. ఈనాడు, తాజా వార్తలు. "తెలంగాణ ఫలితాలు: జిల్లాల వారీగా వివరాలు ఇలా." Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (12 December 2018). "అసెంబ్లీకి ఎన్నికైన తొమ్మిదిమంది మహిళలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  5. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  6. ఈనాడు దినపత్రిక, తేది 27-05-2009
  7. 10టివీ (17 January 2019). "దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  8. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (17 January 2019). "ముందుగా మహిళా ఎమ్మెల్యేలు". Archived from the original on 31 March 2019. Retrieved 31 March 2019.
  9. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  10. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  11. సాక్షి, పాలిటిక్స్ (9 September 2019). "మూడోసారి మంత్రిగా.. సబితా ఇంద్రారెడ్డి". Sakshi. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
  12. సాక్షి, తెలంగాణ (11 September 2019). "ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి". Sakshi. Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019.