తెలంగాణ తల్లి

తెలంగాణ ప్రజలకు మాతృదేవత

తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజల మాతృదేవతగా ప్రతీక. ఈమెను తెలంగాణ దేవతగా, తెలంగాణ మాండలికంగా తెలంగాణ ప్రజలు అస్తిత్వంగా భావించారు.[1][2][3]

పెద్ద కోర్పోలులో తెలంగాణ తల్లి విగ్రహం

తెలంగాణ తల్లి రూప నేపథ్యం

మార్చు

తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, దాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసారథి కేసీఆర్‌దే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బిఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేయగా, కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభరణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రించాడు. ఈ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది.

తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు, ఉద్యమ సారథి కేసీఆర్ ముందుపెట్టగా ఆయన కొన్ని మార్పులు సూచించాడు. ఈ విషయమై చర్చించడానికి తెలంగాణ భవన్‌లో రెండు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఎస్ రాములు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్, గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ అమరవీరుల స్థూపం సృష్టికర్త ఎక్కా యాదగిరి రావు, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు దుర్గం రవీందర్, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, ఈ తరం చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, మహిళలు, రచయితలు, జర్నలిస్టులు,ఉద్యమకారులు పాల్లొన్నారు.

ఈ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎప్పటికీ ఇలాగే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భారత మాత చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని తలపించేలా తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని కేసీఆర్ సూచించారు. కెసిఆర్ సూచనతోపాటు సమావేశాల్లో పాల్గొన్న మరికొందరు ఇచ్చిన సూచనలకు తగినట్లుగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు.

తెలంగాణలోని నాటి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణతల్లి రూపకల్పనలో జోడిస్తూ తీర్మానించడం, జరిగింది. వాటిని సమన్వయిస్తూ బి ఎస్ రాములు డిజైనింగ్ రూపాన్ని సూచించారు. అలా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్ వెండి మట్టెలు, కోహినూర్ వజ్రం, జాకబ్ వజ్రం, పాలమూరు, మెదక్మె, అదిలాబాద్ మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు, నిజామాబాద్. వరంగల్, కరీంనగర్, జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా, రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం, వడ్డాణం, జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుదినెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు సంశ్లేషించబడ్డాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. reddy, l venkat ram (2014-05-26). "'Jaya Jaya He Telangana' to be the new state song". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-04-19.
  2. Jun 2, TNN / Updated:; 2014; Ist, 05:42. "Salaam Telangana: Hopes soar in Telangana as India sees birth of its 29th state | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-04-19. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "Colourful Police Parade Marks Official T State Day". The New Indian Express. Retrieved 2021-04-19.

www.ntnews.com/telangana-news/information-about-telangana-talli-statue-1-1-531124.html

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.