తెలంగాణ దేవాదాయ శాఖ

తెలంగాణ ప్రభుత్వ శాఖ

తెలంగాణ దేవాదాయ శాఖ అనేది తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల సేవకోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.

తెలంగాణ దేవాదాయ శాఖ
స్థాపన2014, జూన్ 2
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణదేవాలయాల సేవ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
శాఖామంత్రిఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

2016 డిసెంబరు 16న తొలిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని దేవాలయాలను నిర్వహించే క్యాబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. ప్రస్తుతం అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2]

కార్యకలాపాలు

మార్చు

ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం దశలవారీగా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేరెన్నగన్న దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నది. జిల్లాల వారీగా ఎంపికచేసిన ప్రముఖ ఆలయాల్లో స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్డీఎఫ్‌) కింద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నది.

నిధుల మంజూరు

మార్చు

ఇవిగాకుండా ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6000 చొప్పున 4,000 దేవాలయాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. 2023 మే నెలనాటికి రాష్ట్రంలోని ప్రధాన 16 దేవాలయాలకు సుమారు 170 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్‌ నిధులతో 146 పనులు మంజూరయ్యాయి. ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి 100 కోట్ల రూపాయలతోపాటు మొత్తం ఐదు ప్రధాన దేవాలయాలకు 136 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.[3]

మంత్రుల జాబితా

మార్చు
క్రమసంఖ్య ఫోటో పేరు పదవీకాలం పార్టీ ముఖ్యమంత్రి మూలాలు
పదవి ప్రారంభం పదవి ముగింపు పదవీకాలం

(రోజులలో)

1.   అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2014 డిసెంబరు 16 2018 సెప్టెంబరు 6 1361 భారత రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర్ రావు [4]
2. 2019 ఫిబ్రవరి 19 అధికారంలో ఉన్నాడు 1531 [5]

మూలాలు

మార్చు
  1. "Telangana State Portal Council of Ministers (Present)". www.telangana.gov.in. Retrieved 2023-05-05.
  2. "Six ministers inducted into Telangana Cabinet". The Hindu. 2014-12-16. ISSN 0971-751X. Retrieved 2023-05-05.
  3. telugu, NT News (2023-05-12). "Telangana | వెల్లివిరిస్తున్న ఆధ్యాత్మిక శోభ.. 16 ఆలయాల్లో కొనసాగుతున్న పనులు". www.ntnews.com. Archived from the original on 2023-05-18. Retrieved 2023-05-18.
  4. "66 days with 1 minister, Telangana CM KCR to expand cabinet on February 19". The Times of India. 2019-02-16. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
  5. "Telangana Cabinet Expansion: KCR Inducts 10 Ministers". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-02-19. Retrieved 2023-05-05.