అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మంత్రి. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 నుండి తెలంగాణ దేవాదాయ, న్యాయ, అటవీ శాఖల మంత్రిగా ఉన్నాడు. 2014 జనరల్ ఎన్నికల్లో బి.ఎస్.పి. అభ్యర్థిగా నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 10వ, 14వ లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[1][2][3]
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 ఫిబ్రవరి 2019 - 3 డిసెంబర్ 2023 | |||
నియోజకవర్గం | నిర్మల్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ
తెలంగాణ ప్రభుత్వం | |||
పదవీ కాలం 2014 – 2018 | |||
నియోజకవర్గం | నిర్మల్ శాసనసభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2014 – 3 డిసెంబర్ 2023 | |||
ముందు | ఏలేటి మహేశ్వర్ రెడ్డి | ||
తరువాత | సముద్రాల వేణుగోపాలాచారి | ||
నియోజకవర్గం | ఆదిలాబాద్ | ||
పార్లమెంట్ సభ్యుడు, 14వ లోక్‌సభ
| |||
పదవీ కాలం 2008 – మే 2009 | |||
ముందు | టి. మధుసూధన్ రెడ్డి | ||
తరువాత | రమేష్ రాథోడ్ | ||
శాసనసభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ
| |||
పదవీ కాలం 2004 – 2008 | |||
ముందు | ఇంద్రకరణ్ | ||
తరువాత | ఏలేటి మహేశ్వర్ రెడ్డి | ||
నియోజకవర్గం | నిర్మల్ శాసనసభ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | నల్ల ఇంద్రకరణ్ రెడ్డి | ||
తరువాత | నల్ల ఇంద్రకరణ్ రెడ్డి | ||
నియోజకవర్గం | నిర్మల్ శాసనసభ నియోజకవర్గం | ||
పార్లమెంట్ సభ్యుడు, 10వ లోక్‌సభ
| |||
పదవీ కాలం జూన్ 1991 – మే 1996 | |||
ముందు | పి. నర్సారెడ్డి | ||
తరువాత | సముద్రాల వేణుగోపాలాచారి | ||
నియోజకవర్గం | ఆదిలాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఎల్లపల్లి, నిర్మల్, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ | 1949 ఫిబ్రవరి 16||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ | ||
తల్లిదండ్రులు | నారాయణరెడ్డి (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | విజయలక్ష్మీ | ||
సంతానం | గౌతమ్ | ||
నివాసం | నిర్మల్, ఆదిలాబాద్ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | వ్యవసాయదారుడు, సామాజిక కార్యకర్త |
జననం - చదువు
మార్చుఇంద్రకరణ్ నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం ఎల్లపల్లిలో 1949 ఫిబ్రవరి 16న జన్మించాడు.[4] ఈయన తండ్రి నారాయణరెడ్డి. ఇంద్రకరణ్ నిజామాబాదులోని గిరిజ ప్రభుత్వ కళాశాలలో బి.కాం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చదివాడు.[5]
వివాహం
మార్చు1975 మే 4న విజయలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.
వృత్తి
మార్చుఉపాధ్యాయుడు, వ్యవసాయదారుడు.
రాజకీయరంగం
మార్చు1980ల ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఇంద్రకరణ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా పనిచేశాడు. 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2008లో ఉపఎన్నికల తర్వాత 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][6] 10వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నాడు. 2018లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8][9][10]
ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 18738 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[11][12] అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మే 01న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[13][14]
పదవులు
మార్చుభారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10వ లోక్ సభ (1991-96), 2008లో 14వ లోక్ సభ ఉపఎన్నికలలో ఎన్నికయ్యాడు.[15][16]
- 1985 ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్[17]
- 1987 మే 2- 1991 జూలై 1 ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్
- తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో కెసీఆర్ తొలి మంత్రివర్గంలో దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖల, అటవీశాఖ మంత్రిగా ఉన్నాడు.[18][19][20]
క్రమసంఖ్య | నుండి | వరకు | స్థానం | వ్యాఖ్యలు |
---|---|---|---|---|
01 | 1991 | 1996 | సభ్యుడు, 10 వ లోక్ సభ | |
02 | 1999 | 2004 | సభ్యుడు, 11 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
03 | 2004 | 2008 | సభ్యుడు, 12 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
04 | 2008 | 2009 | సభ్యుడు, 14 వ లోక్‌సభ | ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యాడు |
05 | 2014 | 2018 | సభ్యుడు, 1 వ తెలంగాణ శాసనసభ | |
06 | 2018 | 2023 డిసెంబరు 3 | 2 వ తెలంగాణ శాసనసభ సభ్యుడు |
సందర్శన
మార్చుహాంకాంగ్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలు సందర్శించాడు.
ఇతరములు
మార్చు- సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
వనరులు
మార్చు- ↑ 1.0 1.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 5 December 2014. Retrieved 12 August 2021.
- ↑ "Election Results 1991" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 12 August 2021.
- ↑ "Election Results 2008". Election Commission of India. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 12 August 2021.
- ↑ Sakshi (17 December 2014). "కొత్త మంత్రుల జీవిత విశేషాలు..." Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
- ↑ "Member Profile". Lok Sabha website. Archived from the original on 5 December 2014. Retrieved 17 January 2014.
- ↑ "Earlier Lok Sabha". Lok Sabha website. Archived from the original on 16 January 2014. Retrieved 12 August 2021.
- ↑ "Election Results 1991" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 12 August 2021.
- ↑ "Profile Telangana". Telangana Legislature website. Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
- ↑ "Nirmal assembly constituency". www.elections.in. Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
- ↑ "Adilabad parliamentary constituency". www.elections.in. Archived from the original on 29 జూన్ 2021. Retrieved 12 August 2021.
- ↑ BBC News తెలుగు (3 December 2023). "ఓటమి పాలైన మంత్రులు ఎవరు? ఎంత తేడాతో ఓడిపోయారు?". Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
- ↑ Eenadu (4 December 2023). "ఆరుగురు మంత్రుల పరాజయం". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Andhrajyothy (1 May 2024). "కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి". Archived from the original on 1 May 2024. Retrieved 1 May 2024.
- ↑ EENADU (2 May 2024). "కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
- ↑ "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2014-12-05. Retrieved 2014-02-04.
- ↑ ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
- ↑ Sakshi (29 November 2018). "నిర్మల్: కలిసిపోయిన గురుశిష్యులు". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.