తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ

తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ (ఆంగ్లం: Telangana State Food Commission) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆహారం, పోషకాహార భద్రతను అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్.[1]

తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్
తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ లోగో
కమిషన్ అవలోకనం
స్థాపనం 10 ఏప్రిల్ 2017; 7 సంవత్సరాల క్రితం (2017-04-10)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
Minister responsible గంగుల కమలాకర్, తెలంగాణ పౌరసరఫరాల శాఖ
కమిషన్ కార్యనిర్వాహకుడు/లు గోలీ శ్రీనివాస్‌రెడ్డి, (చైర్మన్)
ఓరుగంటి ఆనంద్
భానోత్ సాంగులాల్
కొణతం గోవర్ధన్ రెడ్డి
రంగినేని శారద
ములకుంట్ల భారతి
వెబ్‌సైటు
అధికారిక వెబ్సైటు

ఏర్పాటు

మార్చు

తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని పొందడం ద్వారా మానవ జీవన చక్ర విధానంలో ఆహారం, పోషకాహార భద్రతను అందిస్తుందని జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, సెప్టెంబరు 10న భారత గెజిట్‌లో ప్రచురించబడింది. ఆ చట్టంలోని సెక్షన్ 16లోని నిబంధనల ప్రకారం ఈ చట్టం అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆహార కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ 2017 ఏప్రిల్ 10న జీవో నెం.02 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ను ఏర్పాటుచేసింది.

విధులు

మార్చు

లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం, ప్రసూతి ప్రయోజనాలు (కేసీఆర్ కిట్) మొదలైనవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

  1. జాతీయ ఆహార భద్రతా చట్టానికి సంబంధించి ప్రభుత్వ విధాన నిర్ణయాలను పాటించడంలో తనిఖీ చేయడం
  2. చట్ట ప్రయోజనాలు, అర్హతల గురించి అవగాహన కల్పించేందుకు ప్రాంతీయ శిబిరాలను నిర్వహించడం
  3. వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం పౌర సరఫరాల శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం, పాఠశాల విద్యా శాఖల పనితీరుపై ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన చర్యలను తీసుకోవడం

అధికారాలు

మార్చు
  1. జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 ప్రకారం పథకాల అమలును పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం
  2. స్వయంచాలకంగా లేదా ఫిర్యాదు అందిన తర్వాత హక్కు ఉల్లంఘనలపై విచారించడం
  3. జిల్లా ఫిర్యాదుల పరిష్కార అధికారి ఉత్తర్వులపై అప్పీళ్లను వినడం
  4. ఆహారం, పోషకాహార సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం, వ్యక్తులు ఈ చట్టంలో పేర్కొన్న వారి అర్హతలను పూర్తిగా పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, వారి ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, అలాగే సంబంధిత సేవలను అందించడంలో పాలుపంచుకున్న ప్రభుత్వేతర సంస్థలకు సలహాలు ఇవ్వడం

కమిషన్ సభ్యులు

మార్చు

2017 ఏప్రిల్ 12న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.3 ద్వారా బీసీ కమిషన్ చైర్మన్‌, సభ్యులను నియమించడానికి ఎన్నిక కమిటీ ఏర్పాటయింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదలనతో 2017 ఏప్రిల్ 17న జీవో నెం. 5 ద్వారా కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులు 2017 మే 29న బాధ్యతలు స్వీకరించారు.[2] కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. 2022 మే 28న కమిషన్ సభ్యుల పదవీకాలం మరో 5 ఏళ్ళపాటు (లేదా 65 ఏళ్ళ వయసు వచ్చేవరకు) పొడగించబడింది.[3]

  • చైర్మన్: గోలి శ్రీనివాస్‌రెడ్డి[4]
  • సభ్యులు: ఓరుగంటి ఆనంద్, భానోత్ సాంగులాల్, కొణతం గోవర్ధన్ రెడ్డి, రంగినేని శారద, ములుకుంట్ల భారతి.[5]

మాజీ చైర్మన్లు

మార్చు
  • కొమ్ముల తిరుమల్ రెడ్డి

వెబ్సైటు ప్రారంభం

మార్చు

తెలంగాణలో ఆహార భద్రత వివరాలను ఎప్పటికప్పుడు అందిండంలో భాగంగా కమిషన్ వెబ్సైటును రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022, మే 27న తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ చేతులమీదుగా ఈ వెబ్సైటు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.[6][7]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telangana State Food Commission". www.tsfc.telangana.gov.in. Archived from the original on 2020-11-01. Retrieved 2022-05-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Telangana State Food Commission Members Selection". www.tsfc.telangana.gov.in. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "TS News: తెలంగాణ ఆహార కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాలం పొడిగింపు". EENADU. 2022-05-28. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.
  4. Namasthe Telangana (29 August 2023). "ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌గా గోలి". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  5. "Telangana State Food Commission Members". www.tsfc.telangana.gov.in. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "తెలంగాణ ఫుడ్ కమిషన్ Website ప్రారంభం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-05-27. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.
  7. "తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ వెబ్‌సైట్‌ ప్రారంభం". NavaTelangana. 2022-05-27. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.

బయటి లంకెలు

మార్చు