గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] ఈయన 2009, 2014, 2018, 2023 నుంచి కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.[2] తెలంగాణ ప్రభుత్వంలో పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[3]

గంగుల కమలాకర్
గంగుల కమలాకర్


బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 సెప్టెంబర్ 8
నియోజకవర్గం కరీంనగర్, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం మే 8, 1968
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మీ నర్సమ్మ
జీవిత భాగస్వామి రజిత
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం కరీంనగర్, తెలంగాణ

జీవిత విషయాలు

మార్చు

కమలాకర్ 1968, మే 8న మల్లయ్య, లక్ష్మీ నర్సమ్మ అనే దంపతులకు కరీంనగర్ లో జన్మించాడు. తన వృత్తి విద్యా ను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తిచేసాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

కమలాకర్ కు రజితతో వివాహం జరిగింది.[4] వారికి ఒక కుమారుడు హరిహరణ్‌,[5] ఒక కుమార్తె.

రాజకీయ విశేషాలు

మార్చు

2000లో గంగుల కమలాకర్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2000 - 2005 మధ్యకాలంలో కరీంనగర్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, కరీంనగర్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశాడు. 2006 - 2007 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపికి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై గెలుపొందాడు.[7] 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.[8][9][10][11]

ఇతర వివరాలు

మార్చు

మలేషియా, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు పర్యటించాడు.

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-27. Retrieved 2019-04-27.
 2. "Gangula Kamalakar". www.myneta.info. Retrieved 2021-08-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
 4. Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
 5. Sakshi (1 August 2022). "ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
 6. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
 7. "Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes". టైమ్స్ నౌ. టైమ్స్ నౌ. Retrieved 27 April 2019.
 8. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
 9. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
 10. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (9 September 2019). "వెలమల కోటలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌". www.andhrajyothy.com. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
 11. Eenadu (15 November 2023). "మళ్లీ మంత్రిస్తారా?". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.