తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సంస్థ

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సంస్థ.[1] పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలను అమలుచేసేందుకు బోర్డుకు అధికారాలు ఉన్నాయి. జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ నివార‌ణ‌, బయో మెడిక‌ల్ వేస్టేజ్, నిర్మాణ, కూల్చివేతల, హానిక‌ర‌, ఇంధన వ్యర్థాల నిర్వహణ నిర్వీర్యం, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేష‌ణ‌, న‌దీ జ‌లాల కాలుష్య నియంత్రణకు ఈ మండలి చర్యలు తీసుకుంటుంది.[2]

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
సంస్థ వివరాలు
స్థాపన 7 జూలై 2014
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
సంబంధిత మంత్రి టి. హరీశ్ రావు, ఆరోగ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వం
కార్యనిర్వాహకులు పి. సత్యనారాయణ రెడ్డి, మండలి చైర్మన్
Parent agency ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం
వెబ్‌సైటు
http://tspcb.cgg.gov.in/

చరిత్ర మార్చు

నీటి సెక్షన్ (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1974, వాయు సెక్షన్ 5 (కాలుష్య నివారణ, కాలుష్య నియంత్రణ) చట్టం 1981 కింద 2014 జూలై 7న ఈ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేయబడింది.

బాధ్యతలు మార్చు

పర్యావరణ చట్టాలు, నియమాలను అమలుచేసే బాధ్యత ఈ బోర్డుకి ఉంది:[3]

 • నీటి చట్టం
 • వాయు చట్టం
 • పర్యావరణ పరిరక్షణ చట్టం
 • ప్రమాదకర వ్యర్థ నియమాలు
 • బయో మెడికల్ వేస్ట్ నియమాలు
 • మున్సిపల్ ఘన వ్యర్థ నియమాలు
 • ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, వినియోగ నియమాలు
 • ఈ-వేస్ట్ (నిర్వహణ, నిర్వహణ) నియమాలు, 2011.

విధులు మార్చు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వర్తిస్తున్న కొన్ని విధులు:[4]

 • నీటి కాలుష్యం, నివారణ, నియంత్రణ లేదా నీటి కాలుష్యపు సమస్యలకు సంబంధించిన పరిశోధనలు చేయడంతోపాటు ఇతరులు చేస్తున్న పరిశోధనలను ప్రోత్సహించడం, నిర్వహించడం, పాల్గొనడం
 • మురుగునీటి, వాణిజ్య వ్యర్ధాల ద్వారా వచ్చే నీటిని స్వీకరించే నాణ్యత కొరకు, రాష్ట్ర జలాలను వర్గీకరించడానికి, నీటి ప్రమాణాలను వేయడానికి, సవరించడానికి లేదా రద్దు చేయడానికి[5]
 • ఏదైనా పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం
 • వ్యవసాయంలో మురుగునీటి వినియోగం తగిన వాణిజ్య వ్యర్థాలను ఉపయోగించే పద్ధతులను రూపొందించడం

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. The Hindu, Telangana (7 July 2014). "Telangana PCB constituted". Archived from the original on 24 August 2020. Retrieved 24 August 2020.
 2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (24 August 2020). "కాలుష్య నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి". ntnews. Archived from the original on 24 August 2020. Retrieved 24 August 2020.
 3. "Telangana Pollution Control Board (About us)". tspcb.cgg.gov.in. Retrieved 2020-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Telangana Pollution Control Board (Functions & Activities)". tspcb.cgg.gov.in. Retrieved 2020-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. The Hans India, Telangana (14 July 2015). "PCB to monitor water quality in river on day-to-day basis". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 August 2020. Retrieved 24 August 2020.

ఇతర లంకెలు మార్చు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారిక వెబ్సైటు