తన్నీరు హరీశ్ రావు
తన్నీరు హరీశ్ రావు (జ. జూన్ 3, 1972) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు.[2] 2019 సెప్టెంబరు 8 నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తన్నీరు హరీశ్ రావు | |||
| |||
ఆర్థిక శాఖామంత్రి,
తెలంగాణ ప్రభుత్వం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 సెప్టెంబర్ 8-2023 డిసెంబర్ 3 | |||
ముందు | ఈటెల రాజేందర్ | ||
---|---|---|---|
తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్-శాసన వ్యవహారాల మంత్రి
తెలంగాణ ప్రభుత్వం | |||
పదవీ కాలం 2014 – 2018 | |||
ముందు | పదవి ఏర్పాటు | ||
తరువాత | వేముల ప్రశాంత్ రెడ్డి | ||
నియోజకవర్గం | సిద్ధిపేట, తెలంగాణ | ||
యూత్ ఎఫైర్స్ శాఖమంత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | |||
పదవీ కాలం 2004 – 2005 | |||
నియోజకవర్గం | సిద్ధిపేట, తెలంగాణ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004–ప్రస్తుతం | |||
నియోజకవర్గం | సిద్ధిపేట, తెలంగాణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తోటపల్లి, బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం | 1972 జూన్ 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | శ్రీనితరావు | ||
సంతానం | అర్చిస్ మాన్ | ||
పూర్వ విద్యార్థి | కాకతీయ విశ్వవిద్యాలయం |
2014-2018 మధ్యకాలంలో తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్-శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.[3] 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో, భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన శాసనసభలోనూ ఆరుసార్లు సభ్యుడయ్యారు.[4]
ప్రారంభ జీవితం
మార్చుఈయన 1972, జూన్ 3న సత్యన్నారాయణ, లక్ష్మీబాయి దంపతులకు మెదక్ జిల్లా, సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. వానినికేతన్ పాఠశాలలో చదువుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి (భారత్ రాష్ట్ర సమితి) వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేనల్లుడు. హరీష్ రావుకు భార్య శ్రీనిత, కుమారుడు అర్చిస్ మాన్, కుమార్తె ఉన్నారు.[5]
రాజకీయ జీవితం
మార్చుహరీశ్ రావు 2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశాడు.[6] కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
తెలంగాణ కోసం రాజీనామా చేసి సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచాడు. 2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశాడు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[7][8][9] హరీష్ రావుకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం 2021, నవంబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది.[10]
రాజకీయ గణాంకాలు
మార్చుఎన్నికల సంవత్సరం | కోసం పోటీ పడ్డారు | నియోజకవర్గం | రాజకీయ పార్టీ | స్థితి | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|
1 | 2004 (పోల్స్ ద్వారా) | ఎమ్మెల్యే | సిద్దిపేట | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 24,829 |
2 | 2008 (పోల్స్ ద్వారా) | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 58,935 | ||
3 | 2009 | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 64,677 | ||
4 | 2010 (పోల్స్ ద్వారా) | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 95,878 | ||
5 | 2014 | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 93,328 | ||
6 | 2018 | తెలంగాణ రాష్ట్ర సమితి | గెలుపు | 1,20,650 |
నీటిపారుదల మంత్రిగా
మార్చుహరీష్ రావు 2014, జూన్ 2న నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, సరస్సులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 2015 మార్చి 12న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. దీనిలో భాగంగా, ప్రభుత్వం 45,000+ చెరువులు, సరస్సులను పునరుద్ధరించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుహరీశ్ రావు శ్రీనితను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆయన మాసబ్ ట్యాంక్ లో గల జె.ఎన్.టి.యు లో పాలిటెక్నిక్ చదివాడు.
మూలాలు
మార్చు- ↑ "The Hindu : Front Page : TRS MLA's meeting with YSR raises eyebrows". Archived from the original on 2014-02-28. Retrieved 2014-05-24.
- ↑ "Telangana: TRS MLAs likely to resign - Economic Times". Archived from the original on 2013-03-01. Retrieved 2014-05-24.
- ↑ Lasania, Yunus Y. (11 December 2018). "Harish Rao wins Siddipet for third time, may set record". Mint. Retrieved 11 December 2018.
- ↑ "Telangana Assembly Election Results: Harish Rao becomes nation's youngest MLA to be elected six times". newsd.in. 11 December 2018. Retrieved 11 December 2018.
- ↑ Namaste Telangana (30 November 2023). "సతీసమేతంగా సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీశ్‌రావు". Archived from the original on 30 November 2023. Retrieved 30 November 2023.
- ↑ Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
- ↑ సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
- ↑ నమస్తే తెలంగాణ, తాజావార్తలు (9 September 2019). "ఎమ్మెల్యేగా ఆరు సార్లు.. మంత్రిగా మూడు సార్లు." ntnews.com. Archived from the original on 9 September 2019. Retrieved 9 September 2019.
- ↑ Sakshi (9 November 2021). "ఆర్థిక శాఖతో పాటు హరీష్‌రావుకు మరో కీలక శాఖ". Archived from the original on 9 నవంబరు 2021. Retrieved 9 November 2021.
బయటి లంకెలు
మార్చు- A blog post by T. Harish Rao
- http://www.khaleejtimes.com/displayarticle.asp?xfile=data/international/2011/July/international_July1057.xml§ion=international&col= Archived 2012-10-01 at the Wayback Machine
- http://articles.economictimes.indiatimes.com/2011-07-05/news/29739072_1_resignations-trs-mlas-telangana-activists Archived 2013-03-01 at the Wayback Machine
- http://www.hindu.com/2008/06/03/stories/2008060356990100.htm Archived 2014-02-28 at the Wayback Machine