తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పోరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థ. వ్యవసాయం, చమురు, గ్యాస్ మొదలైన వస్తువులు, ఆహారధాన్యాలు, పదార్థాలు, ఇతర వస్తువుల నాణ్యతను నిర్ధారించడంతోపాటు ఆర్థిక, ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, తరలింపు, రవాణా, పంపిణీ, అమ్మకం విషయాలలో సిబ్బందికి శిక్షణ అందిచడం ఈ సంస్థ ముఖ్యొద్దేశ్యం.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ | |
---|---|
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లోగో | |
ప్రభుత్వ సంస్థ అవలోకనం | |
స్థాపనం | 18 మార్చి 2015 |
అధికార పరిధి | తెలంగాణ |
ప్రధాన కార్యాలయం | సోమాజిగూడ, హైదరాబాదు |
Minister responsible | గంగుల కమలాకర్, (పౌరసరఫరాల శాఖామంత్రి) |
మాతృ శాఖ | పౌరసరఫరాల శాఖ |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ను ఎఫ్సీఐకి అప్పగిస్తుంది.
ప్రారంభం
మార్చులిమిటెడ్ కంపెనీల చట్టం, 2013 ప్రకారం 2015 మార్చి 18న ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది.
కార్యకలాపాలు
మార్చు- ప్రభుత్వ సూచనల మేరకు కనీస మద్దతు ధరతో వరి సేకరణ
- ఆహారధాన్యాల కొనుగోలు, రవాణా, నిల్వ, ప్రజా పంపిణీ
- బహిరంగ మార్కెట్, ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాలలో “దీపం” పథకం కింద చమురు కంపెనీల గ్యాస్ డీలర్‌గా కూడా వ్యవహరించడం
- ఉచిత వాణిజ్య కిరోసిన్ పంపిణీ
సిబ్బంది
మార్చుచైర్మన్, ఇతర బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియమిస్తుంటుంది. వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కార్పోరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటారు. సంస్థ కార్యాలయంలో ఇద్దరు జనరల్ మేనేజర్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఉంటారు. ఈ సంస్థకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్లు జిల్లాల్లో సంస్థకు ఎక్స్-అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా, జిల్లా మేనేజర్లు జిల్లా కార్యాలయాలకు అధిపతిగా ఉంటారు.[1]
పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి చైర్మన్ గా నియమించబడ్డాడు. ఆ తరువాత మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ అయ్యాడు. తెలంగాణ ఉద్యమకారుడు, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌గా పనిచేసిన సర్దార్ రవీందర్ సింగ్ 2022 డిసెంబరు 8న ఈ సంస్థ చైర్మన్ గా నియమించబడ్డాడు.[2]
ధాన్యం కొనుగోలు
మార్చుఈ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు, 2020 యాసంగిలో 64.11 లక్షల మెట్రిక్ టన్నులు, 2021 యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.[3]
మూలాలు
మార్చు- ↑ "Telangana State Civil Supplies Corporation Ltd". tscscl.telangana.gov.in. Archived from the original on 2022-08-12. Retrieved 2022-12-08.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ telugu, NT News (2022-12-08). "సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
- ↑ "ధాన్యం కొనుగోళ్లల్లో ఈ ఏడాది సరికొత్త రికార్డు: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్". ap7am.com (in ఇంగ్లీష్). 2021-05-28. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
బయటి లింకులు
మార్చు- అధికారిక వెబ్ సైట్ Archived 2022-12-08 at the Wayback Machine