సర్దార్ రవీందర్ సింగ్
సర్దార్ రవీందర్ సింగ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన జూలై 2014 నుండి 2019 వరకు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌గా పనిచేశాడు. 2022 డిసెంబరు 8న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా[1][2], డిసెంబరు 21న బాధ్యతలు చేపట్టాడు
సర్దార్ రవీందర్‌సింగ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 డిసెంబరు 8 - ప్రస్తుతం | |||
కరీంనగర్ మాజీ మేయర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జులై 2014 నుండి 2019 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 6 ఆగస్టు 1964 కరీంనగర్ పట్టణం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | బల్బీర్ కౌర్ | ||
సంతానం | 2 | ||
నివాసం | కరీంనగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, న్యాయవాది |
జననం, విద్యాభాస్యం
మార్చుసర్దార్ రవీందర్ సింగ్ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పట్టణంలోని సిఖ్ వాడలో 1964 ఆగస్టు 6లో లక్ష్మణ్ సింగ్, దన్నాభాయ్ దంపతులకు జన్మించాడు. ఆయన కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, నాందేడ్లో 1987లో ఎల్.ఎల్.బి పూర్తి చేసి న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2008లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
మార్చురవీందర్సింగ్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో 1984లో కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే కరీంనగర్ పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో 1995లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1999 నుంచి 2006 వరకు కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశాడు.
రవీందర్‌సింగ్ కరీంనగర్ పురపాలక సంఘానికి 2000లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా, 2005లో ఏర్పడిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2006లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2010లో టీఆర్‌ఎస్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. రవీందర్‌సింగ్ 2006లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌కు నగరంలో అత్యంత మెజారిటీ రావడంలో కృషి చేశాడు. ఆయన 2010లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి రెండొవసారి కార్పొరేటర్‌గా గెలిచాడు.
రవీందర్‌సింగ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ 50 కు పైగా సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా, ఆర్టీసీ టీఎంయూ కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా, పలు ట్రేడ్ యూనియన్ల గౌరవ సలహాదారుడిగా పనిచేశాడు. ఆయన 2014లో కరీంనగర్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచి జూలై 2014లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికై దక్షిణ భారతదేశంలో ఏకైక సిక్కు మేయర్‌గా రికార్డు సృష్టించి, తెలంగాణ రాష్ట్ర మేయర్ల & చైర్మన్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3]
రవీందర్‌సింగ్ 2021 డిసెంబరు 9లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ స్థానిక సంస్థల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు.[4][5][6] ఆయనకు చాలా సార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని మనస్థాపం చెంది 2021 నవంబరు 25న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[7][8][9][10][11] రవీందర్‌సింగ్ శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి అనంతరం 2021 డిసెంబరు 31న ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ప్రగతిభవన్‌లో ఆయనను కలిశాడు.[12]
సర్దార్ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ డిసెంబరు 08న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశాడు.[13][14][15]
మేయర్‌గా పలు అభివృద్ధి పనులు
మార్చు- కరీంనగర్ కార్పొఆర్టిన్ పరిధిలో ఒక రూపాయికే నల్లా కనెక్షన్ [16]
- రవీందర్‌సింగ్ మేయర్‌గా ఉన్న సమయంలో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 2019 జూన్ 15లో “అంతిమ యాత్ర - ఆఖరి సఫర్” పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో స్థానికంగా ఎవరైనా చనిపోతే రూపాయికే కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించి, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్న వారికి భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్‌లో ఇలాంటి కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఈ పథకం వివరాలను తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించి పేద, ధనిక బేధం లేకుండా, కులమతాల ప్రస్తావన లేకుండా ఇలాంటి పథకం అమలు చేయడం పట్ల మేయర్ ను, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలికి అభినందనలు తెలిపాడు.[17][18][19]
- కరీంనగర్ కార్పొరేషన్ ఆవరణలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్ చేసే విధంగా సేవలు అందించారు.
- కరీంనగర్ కళాభారతి ఆవరణలో చెప్పులు లేకుండా తిరిగే అనాథలకు, పేదలకు చెప్పులు అందించే విధంగా బూట్ హౌస్ పథకం ప్రవేశ పెట్టారు. దీనిలో భాగంగా కొందరు మూలన పడేసే పాత చెప్పులు, బూట్లను సేకరించి వాటికి రిపేర్లు చేసి అవసరమైన వారికి అందిస్తారు.
- కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని కమ్యూనిటీ హాళ్లను ఎంపిక చేసి నాలుగు రీడింగ్ రూమ్స్ ఏర్పా టు చేశారు. అందులో ఒకటి మహిళలకు కేటాయించారు.
- కరీంనగర్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్‌లలో అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికీ రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు.[20]
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2022-12-08). "సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్ సింగ్". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.
- ↑ Sakshi (9 December 2022). "స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్". Sakshi. Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Sakshi (4 July 2014). "మాస్ లీడర్ టూ మేయర్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Disha daily (దిశ) (23 November 2021). "టీఆర్ఎస్‌కు షాకిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్.. ఎమ్మెల్సీ పోరుకు రెడీ". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ News18 Telugu (23 November 2021). "కరీంగనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మేయర్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (24 November 2021). "టీఆర్‌ఎస్‌కు ఝలక్". Archived from the original on 2021-11-23. Retrieved 26 November 2021.
- ↑ Andhrajyothy (26 November 2021). "టీఆర్‌ఎస్‌కు రవీందర్‌సింగ్ రాజీనామా". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Andhrajyothy (26 November 2021). "ఉపసంహరణపై ఉత్కంఠ". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Disha daily (దిశ) (25 November 2021). "కేసీఆర్‌కు మరో షాక్.. కరీంనగర్ సీనియర్ నేత రాజీనామా". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Eenadu (26 November 2021). "ఎవరేమన్నా తగ్గేదిలేదు!". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Sakshi (26 November 2021). "కరీంనగర్‌లో కారుకు షాక్! ఆశలు గల్లంతు.. గులాబీకి 'సింగ్' బైబై". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Sakshi (31 December 2021). "కేసీఆర్‌తో రవీందర్ సింగ్ భేటీ". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
- ↑ Namasthe Telangana (9 December 2022). "ఉద్యమనేతకు పట్టాభిషేకం". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
- ↑ Eenadu (9 December 2022). "ఉమ్మడి జిల్లాకు మరో పదవి". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
- ↑ Andhra Jyothy (9 December 2022). "రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్‌గా రవీందర్‌సింగ్". Retrieved 9 December 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (18 February 2015). "రూపాయికే నల్లా కనెక్షన్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ V6 Velugu (20 May 2019). "రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ నిర్ణయం" (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-24. Retrieved 26 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు (21 May 2019). "రూపాయికే అంత్యక్రియలు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Sakshi (22 May 2019). "'రూపాయికే అంత్యక్రియలు' భేష్". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Telugu One (30 June 2019). "శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.