తెలంగాణ వాస్తు శిల్పం

తెలంగాణ వాస్తు శిల్పం రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆర్కిటెక్చర్. ఇది హిందూ దేవాలయ నిర్మాణం, ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ రెండింటిలోనూ విస్తృత శైలులతో ప్రాంతీయ వైవిధ్యాలను కలిగి ఉంది.

1213 సంవత్సర కాలంలో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం
కాకతీయ కళాతోరణం

బౌద్ధ వాస్తుశిల్పం మార్చు

నేలకొండపల్లి స్థూపం బౌద్ధ కాలానికి చెందినది. ఇది సముద్ర తీరంలోని మైదానం అంచున ఉంది. ఇటీవలి కాలంలో పురావస్తు త్రవ్వకాల్లో ఒక బౌద్ధ మఠం అవశేషాలు, కొన్ని కళాఖండాలు బయటపడ్డాయి. సా.శ. 6వ శతాబ్దం వరకు ఈ కళాఖండాలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునకొండ అమరావతి బౌద్ధ పురావస్తు ప్రదేశం, కుందుపల్లి బౌద్ధ స్మారక చిహ్నాలు కూడా ఈ కాలానికే చెందినవిగా గుర్తించబడ్డాయి.

హిందూ దేవాలయ నిర్మాణం మార్చు

చాళుక్యుల వాస్తుశిల్పం మార్చు

అలంపూర్‌లోని 7వ శతాబ్దపు అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు.

కాకతీయుల వాస్తుశిల్పం మార్చు

వరంగల్ కోట, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి కాకతీయుల శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణలు.[1][2]

ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మార్చు

 
కుతుబ్ షాహీ సమాధులలో ఒకటి

కుతుబ్ జాకీ సమాధులు, హైదరాబాద్ లోని చార్మినార్, గోల్కొండ, వంటి వాటిని ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కు ఉదాహరణగా చెప్పవచ్చు.

గోల్కొండ సుల్తానేట్ మార్చు

గోల్కొండ సుల్తానేట్ నిర్మాణ శైలి ఇతర దక్కన్ సుల్తానుల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇండో-ఇస్లామిక్ శైలి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. గోల్కొండ కోట శిథిలాలే ఇందుకు ఉదాహరణ. వారు మోర్టార్‌తో విస్తృతమైన సమాధులు, మసీదులను నిర్మించారు.[3]

కలోనియల్ ఆర్కిటెక్చర్ మార్చు

ఫలక్‌నుమా ప్యాలెస్ మార్చు

ఈ ప్యాలెస్ వివిధ రకాల భారతీయ యూరోపియన్ శైలులను కలిగి ఉంది. ఇది ఒక కొత్త వారసత్వ శైలిలో నిర్మించబడిన, హైదరాబాద్‌లోని బ్రిటిష్ పాలకుడి నివాసం.[4]

ఇండో-సార్సెనిక్ మార్చు

హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ సిటీ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కాచికుడ స్టేషన్‌లను ఇండో-సార్సెనిక్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ ఎస్క్ రూపొందించాడు.

స్వాతంత్ర్యం తరువాత మార్చు

ఆధునిక నిర్మాణ శైలిలో హైదరాబాద్ చుట్టూ ఉన్న హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు నిర్మించబడ్డాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌ను క్రిస్టోఫర్ పెన్నింగ్ సమకాలీన శైలిలో రూపొందించాడు.

మూలాలు మార్చు

  1. Law, John. Modern Hyderabad (Deccan). pp. 13–14.
  2. Centre, UNESCO World Heritage. "The Glorious Kakatiya Temples and Gateways". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-03. Retrieved 2018-12-19.
  3. Centre, UNESCO World Heritage. "The Qutb Shahi Monuments of Hyderabad Golconda Fort, Qutb Shahi Tombs, Charminar". UNESCO World Heritage Centre (in ఇంగ్లీష్). Archived from the original on 2018-02-01. Retrieved 2018-12-19.
  4. Nanisetti, Serish (2017-07-29). "Mapping the Art Deco beauties before they vanish". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-26.