అభినయ శ్రీనివాస్
అభినయ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు,[1] రంగస్థల నటుడు, దర్శకుడు.[2] గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం, తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వంటి పాటలను రచించాడు.[3] 2022, జనవరి 5న "స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 మోత్కూర్ పట్టణ బ్రాండ్ అంబాసిడర్" గా నియమించబడ్డాడు.[4]
అభినయ శ్రీనివాస్ | |
---|---|
జననం | జనవరి 23, 1977 మోత్కూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం |
ప్రసిద్ధి | ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకులు , రంగస్థల నటుడు, దర్శకుడు |
భార్య / భర్త | శ్రీలత |
పిల్లలు | వంశీచరణ్, ప్రణవనాథ్ |
తండ్రి | బ్రహ్మచారి |
తల్లి | నర్సమ్మ |
జననం
మార్చుఅభినయ శ్రీనివాస్ అసలు పేరు దొంతోజు శ్రీనివాసచారి. అభినయ కలం పేరు. ఇతడు 1977, జనవరి 23న బ్రహ్మచారి[5], నర్సమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లా, మోత్కూరులో జన్మించాడు.[6]
విద్యాభ్యాసం
మార్చు1992లో పదవ తరగతిలో మోత్కూరు పాత తాలూకా పరిధిలో మొదటిస్థానంలో నిలిచి, నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేశాడు.
వివాహం - పిల్లలు
మార్చుఈయనకు శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (వంశీచరణ్, ప్రణవనాథ్).
కళారంగ ప్రవేశం
మార్చు1989లో మిత్రులతో కలిసి మోత్కూర్ లో అభినయ కళాసమితిని స్థాపించాడు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాటకపోటీల్లో పాల్గొని వందల నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నాడు.
రచనలు
మార్చుసినిమా పాటలు
మార్చు2005లో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ధేఖో ధేఖో భాయ్ అనే పాట ద్వారా సినీరంగ ప్రవేశం చేసి గోరింటాకు, నవ వసంతం, దొంగల బండి, సవాల్, భీమిలి కబడ్డీ జట్టు, మంచివాడు, వెంకటాద్రి, అధినేత, సమర్ధుడు, సేవకుడు, జై తెలంగాణ, వీడు మాములోడు కాదు, నచ్చావ్ అల్లుడు, ఎస్.ఎం.ఎస్., వీర, పోరు తెలంగాణ, జలక్, మా వూరి మహర్షి, మిస్టర్ లవంగం, పున్నమి నాగు, విజయదశమి, ఫస్ట్ లవ్, వాడే కావాలి కాకతీయుడు, వైభవం, తుపాకి రాముడు, జైసిన, గువ్వ గోరింక, రుద్రంగి, చిల్ బ్రో, ట్రెండు మారిన ఫ్రెండ్ మారడు వంటి 70కు పైగా సినిమాలలో అనేక పాటలు రాశాడు.[7] గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం పాట మంచి గుర్తింపునిచ్చింది.[8]
తెలంగాణ పాటలు
మార్చుశరణాంజలి, తెలంగాణ సంగతులు, ఆఖరి మోఖ, ఔర్ ఏక్ ధక్కా వంటి తెలంగాణ పాటల సీడిలు రూపొందించాడు. తెలంగాణ ఉద్యమం కోసం రాసిన ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా పాట మంచి గుర్తింపునిచ్చింది.
టెలివిజిన్ రంగం
మార్చు- 2006లో మాటీవిలో ప్రసారమైన క్రాంతి సీరియల్, ఘర్షణ రియాలిటీ షోలకు టైటిల్ సాంగ్ లు రాశాడు.
- దూరదర్శన్ లో అనేక లలిత గీతాలు రాసి, ఆలపించారు. తొవ్వ ధారావాహికకు టైటిల్ సాంగ్ రాశాడు.
- 2016లో సాక్షి బతుకమ్మ పాటలు... జీతెలుగులో మనసున మనసై మెగా సీరియల్ కు పాటలు రాశాడు.
నాటికలు
మార్చుజాగృతి, నవతరం, సంధిగ్ధ సంధ్య, కాలగర్భం, చరమగీతం. కాలగర్భం నాటికలో 'పాలకుర్తి పోతురాజు', సందిగ్ధ సంధ్య నాటికలో 'భూపతి' పాత్రలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ విలన్ గా గుర్తింపు.
ఇతర రచనలు
మార్చు- యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రాశస్త్య గీతం[9]
అవార్డులు
మార్చు- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు, 2017, జూన్ 2 కెసీఆర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నాడు.[10][11]
- తేజా సాహిత్యం పురస్కారం (2016)
- తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ పురస్కారం
- యు.ఐ.ఎస్.ఈ.ఎఫ్. వారి ప్రోత్సాహిక రచయిత పురస్కారం (2008)
గుర్తింపులు
మార్చు- 1998లో అభినయ శ్రీనివాస్ రచించిన ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్యం పాటల సిడీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదగా ఆవిష్కరణ.
- 2014లో ఏర్పడిన తెలంగాణ సాంస్కృతిక సారథిలో రచయితగా బాధ్యతలు స్వీకరించి, ప్రభుత్వ పథకాలపై పాటలు రాయడం జరిగింది.
- హరితహారం కోసం అభినయ శ్రీనివాస్ రచించిన (మొక్కలు నాటే యజ్ఞం మొదలైయ్యింది... హరితతెలంగాణ నేల పులకరించింది, వానలు వాపస్ రావాలే) పాటలను విన్న ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీనివాస్ ను పిలిచి అభినందించారు.[12]
- స్వచ్ఛ సర్వేక్షన్ - 2022 మోత్కూర్ పట్టణ బ్రాండ్ అంబాసిడర్ (2022, జనవరి 5)[13]
మూలాలు
మార్చు- ↑ య్యూటూబ్. "Singers Abhinaya Srinivas, Maddela Sandeep, Babji in Dhoom Dhaam Show - 6TV Telangana". www.youtube.com. Retrieved 31 January 2017.
- ↑ వెబ్ ఆర్కైవ్ (ఈనాడు), యాదాద్రి భువనగిరి జిల్లా, ప్రత్యేక కథనాలు. "తెరదించిన తెలుగు నాటక రంగం". web.archive.org. Archived from the original on 27 మార్చి 2018. Retrieved 27 March 2018.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (8 May 2021). "ఉస్మానియా క్యాంపస్‌లోఉదయించిన కిరణం". Namasthe Telangana. తిరునగరి శరత్ చంద్ర. Archived from the original on 14 May 2021. Retrieved 8 November 2021.
- ↑ స్వచ్ఛ మోత్కూర్ గా తీర్చిదిద్దాలి, ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 06.01.2022.
- ↑ Andhra Jyothy (5 July 2023). "సినీ గేయరచయిత అభినయ శ్రీనివా్‌సకు పితృవియోగం". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
- ↑ సాక్షి, జిల్లాలు (2 June 2017). "ఉద్యమ పాటకు గుర్తింపు". Sakshi. Archived from the original on 4 June 2017. Retrieved 25 September 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "Abhinaya Srinivas". www.filmibeat.com. Retrieved 31 January 2017.
- ↑ తెలుగు లిరిక్స్. "Lyricist - Abhinaya Srinivas Songs". www.telugulyrics.org. Retrieved 31 January 2017.
- ↑ ఈనాడు, మోత్కూరు, న్యూస్‌టుడే. "జిల్లా ప్రాశస్త్యాన్ని తెలిపే గీతం వినాలి". Retrieved 31 January 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
- ↑ టీన్యూస్ (31 May 2017). "రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక". Retrieved 8 January 2018.[permanent dead link]
- ↑ ఈనాడు, నల్లగొండ జిల్లా వార్తలు (23 October 2019). "అభినయంతో ఆరంభించి.. కలంతో కదంతొక్కి". www.eenadu.net. Archived from the original on 23 October 2019. Retrieved 25 October 2019.
- ↑ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగస్వాములు కావాలి, సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 2022 జనవరి 6.