తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం

తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం

తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా లోని రామగుండంలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతుంది.[1]

తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
రామగుండం ఎన్.టి.పి.సి
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
అక్షాంశ రేఖాంశాలు18°45′18″N 79°28′37″E / 18.75500°N 79.47694°E / 18.75500; 79.47694
స్థితినిర్మాణంలో ఉంది
Construction beganజనవరి 29, 2016
Construction cost10598.98 కోట్లు
సంచాలకులునేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

ప్రారంభం

మార్చు

2020, మే నెల వరకు మొదటి యూనిట్ ను పూర్తిచేసే దిశగా నిర్మాణం జరుగుతుంది. అటు తరువాతి ఆరు నెలలకు రెండవ యూనిట్ పూర్తికానుంది.[2]

సామర్థ్యం

మార్చు
దశ యూనిట్ సంఖ్య స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) ప్రారంభ తేది స్థితి
దశ I, II 2 1600 జనవరి 29, 2016 నిర్మాణంలో ఉంది

ట్రయల్‌ రన్‌

మార్చు

2023 జూలైలో యూనిట్‌-1 లైటప్‌తో ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. అయితే, విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లేర్ ‌గా ప్రకటించడానికి విద్యుదుత్పత్తి ట్రయల్‌ రన్‌ లో భాగంగా 2023 సెప్టెంబరు 2 నుంచి 5 వరకు 72గంటలపాటు ఏకదాటిగా 811.4మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "NTPC chairman visits thermal power project site". Retrieved 3 November 2018.
  2. "KCR urges to speed up works of NTPC's Ramagundam power plant". thehansindia. Retrieved 3 November 2018.
  3. telugu, NT News (2023-09-06). "TSTPP | టీఎస్టీపీపీలో ఫేజ్‌-1 ట్రయల్‌ రన్‌ విజయవంతం." www.ntnews.com. Archived from the original on 2023-09-07. Retrieved 2023-09-07.