తెలిదేవర భానుమూర్తి

తెలిదేవర భానుమూర్తి- కవి, కథకుడు, కాలమిస్ట్, సీనియర్ పాత్రికేయుడు.

ముఖచిత్రంగా తెలిదేవర భానుమూర్తి క్యారెకేచర్

జీవిత విశేషాలు మార్చు

భానుమూర్తి 1953 జనవరి 16భువనగిరిలో జన్మించాడు. తెలిదేవర వెంకట్రావు, సీతమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతడు యాదగిరిగుట్ట, ఆర్మూర్, భువనగిరిలో చదువుకొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి.జి.డిగ్రీ తీసుకొన్నాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్నేహితులతో కలిసి ఈయన నల్లగొండ జైల్లో ఉన్నాడు. అప్పటి నుంచే ఈయన తెలంగాణ బాసలో కవితలు రాయడం మొదలు పెట్టాడు. ఆ కవితలను ఊరోలు అనే పేరుతో అరసం ఓ సంకలనంగా తెచ్చింది. ఉదయం దినపత్రికలో తెలంగాణ బాసలో రాజకీయ వ్యంగ్య రచనలకు శ్రీకారం చుట్టాడు. ఈయన ఎన్టీఆర్ ప్రభుత్వంపై, చంద్రబాబు ప్రభుత్వంపై సంధించిన వ్యంగ్య బాణాలు 335 పలుకుబడి పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఉదయం వారపత్రికలో 'చల్నేదో బాల్ కిషన్ శీర్షికన ఇతడు రాసిన వ్యంగ్య, హాస్య రచనలు ఆదే పేరుతో విశాలాంధ్ర ప్రచురణాలయం పుస్తకంగా వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో ఇతడు రాసిన హాస్య రచనలు గిల్లిదండ అనే పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆక్సిజన్ బార్, నెమీక, గులేర్ అనే కథా సంపుటాలు ఇతని కలం నుంచి వెలువడ్డాయి.

రచనలు మార్చు

  1. ఊరోల్లు
  2. నెమ్లీక
  3. గిల్లిదండ
  4. చల్నేదో బాల్ కిషన్
  5. ఆక్సిజన్ బార్
  6. పలుకుబడి
  7. గులేర్

అభిప్రాయం మార్చు

"తెలిదేవరకు సొంత శైలి. సొంత నడక, స్వంతకం ఉంది. ఇది విశిష్ట లక్షణం. ఎంత చిన్న వాక్యాన్ని చూచినా భానుమూర్తిదని గుర్తు పట్టగలం." - దాశరథి రంగాచార్య

మూలాలు మార్చు