తెలుగువారు పలికే ఉర్దూ పదాలు

తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు :

ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో)

తెలుగు భాషలో ఎన్నో సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, పార్శీ భాషల పదాలు దర్శనమిస్తుంటాయి. కుతుబ్ షాహీల పాలనలో ఊర్దూ అధికార భాషగా చలామణీ అయిన కాలం (క్రీశ 1518-1687) లోనూ, ఆ తరువాత బ్రిటిష్ పాలనలోనూ (క్రీశ 1947 వరకు) ఈ అన్య దేశ్య పదాలు క్రమక్రమంగా తెలుగులోకి ప్రవేశించాయి. ఈ పదాలను దాదాపు పూర్తిగా కలుపుకొని భాష సుసంపన్నమయ్యింది. ఈ దృష్ట్యా చూచినప్పుడు తెలుగు భాషలోకి పదాలు ఎంత సులువుగా ఇమిడి పోగలవన్నది అర్థమవుతుంది. సంస్కృత, ఆంగ్ల పదాలు మన దైనందిన జీవితంలో ఎన్నో వాడబడుతున్నాయి. అయితే తెలుగులో ఉపయోగించబడేవి కొన్ని పదాలు ఉర్దూ పదాలని Archived 2021-04-17 at the Wayback Machine మాత్రం వాడుకరులకు తెలియకపోవొచ్చు. శ్రీనాథుడు,త్యాగరాజు వంటి వాళ్ళు కూడా ఉర్దూపదజాలాన్ని ప్రయోగించారని ఈ రొజు మనకి తెలుసుతున్నది. శ్రీకృష్ణదేవరాయలకు తెలిసిన భాషల్లో ఉర్దూ ఒకటని చరిత్రల ద్వారా తెలియవస్తున్నది. ఈ ఉర్దూపదాల ఉన్న తెలుగు పదాల్ని చంపేసి పాదుకున్నవి కాక కొన్ని సార్లు తెలుగులో లేని వ్యక్తీకరణల్ని అవి అందించాయి. ఆ విధంగా అవి కొన్ని అభివ్యక్తి-శూన్యాల్ని సముచితంగా భర్తీ చేశాయి.

తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో సి.పి.బ్రౌన్‌ పేర్కొన్న ఉర్దూ పదాలు

మార్చు

అసలు, అంగరకా, అంగరేకు, అంగిక, అంగీ, అంగుస్తాను, అంగూరు, అంరు, అండ, అందాజు, అందేషా, అంబారము, అంబారి, అకరం, అకస్వారీ, అకీకత్‌, అక్కసరి, అక్కసు, అక్షాయి, అగాదు, ఆగావు, అజా, అజమాయిషీ, ఆటకాయించు, ఆఠావణీబంట్రోతు, అఠ్వాడ, అడ్డా, అడతి, అడితి, అడిసాటా, అతలషు, అత్తరు, అదాపరచు, అదాలతు, అదావత్‌, అనీం అపరంజి, అబ్వాబు, అభిని, అమలు, అమాంతము, అమాదినుసు, అమానతు, అమానీ, అమానుదస్తు, అమీనా, అమ్రాయి, అయబు, అయిటవేజు, అర్జీ, అర్జు, అలంగము, అలకీహిసాబు, అలగా, అలాదా, అలాహిదా, అలామతు కర్ర , అల్కీ, అల్జి, అల్మార, అలమారు, అల్లీసకర్ర, ఆవాజా,అవుతు, అవుతుఖానా, అవ్వల్‌, అవ్వాయిచువ్వలు, అసలు, అస్తరు, అహలెకారులు, అహషాంబంట్రోతులు.

ఆఖరు, ఆజుబాజు, ఆజమాయిషీ, ఆబాదు, ఆబాలు, ఆబ్కారీ, ఆమిషము, ఆమీను, ఆరిందా, ఆలుగ్డ, ఆవర్జా, ఆసరా, ఆసామీ, ఆసాయము, ఆసోదా,

ఇక్తియారు, ఇజారా, ఇజారు, ఇనాము, ఇరుసాలు, ఇర్సాలు ఇలాకా, ఇస్తిమిరారి, ఇస్తిరి, ఇస్తిహారు,

ఉజాడ, ఉజయబోడ, ఉఠావుఠి, ఉడయించు, ఉద్దారి, ఉపరిరయితు, ఉమేదు (ఉమేజు), ఉల్టా,ఉరుసు

ఏకరారు

ఓకు

కంకర, కంగాళీ, కంగోరీ, కచేరీ, కచ్చా, కజ్జా, కదపా, కదము, కదీము, కబాతుకోడి, కబాయీ, కబురు, కబేలా, కమాను, కమామిషు, కమ్మీచేయ, కరారు, కరుబూజుపండు, కలాలు, కలేజా (ఖలేజా), ఖానా, కళాయి, కళాసి, కవాతు, కసరత్తు, కసాయి, కసుబా, కాగితము, కాజీ, కాతా, కామందు, కాయము, కాయిలా, కారాేనా, కాళీ, కాసా, కితాబు(ఖితాబు), కిఫాయతు, కిమ్మత్తు, కిరాయి, కిలాడి (ఖిలాడి), కిస్తీ, కిస్తు, కుంజడ, కుంజరి, కుందా, కుంబీ, కుడతా, కుడితినీ, కుమ్మకు, కురింజ, కురిచీ, కుల్లాయి, కుశాలు కుస్తీ, కుషీ, (ఖుషీ) కూజా, కూనీ (ఖూనీ) కేపు, కైదీ (ఖైదీ), కైఫియ్యతు, కైరి, కైలు, కొజ్జా, కొఠీ, కొత్వాలు, కొర్నా (కొర్నాసిగండు), కౌలు (కవులు), కల్లిబొల్లి లేదా తెలంగాణా లో అయితే కల్లివిల్లి (ఖల్బలీ),

ఖజానా, ఖరాగా, ఖరారా (ఖరారు), ఖరీదు, ఖర్చు, ఖసిచేయు, ఖామందు, ఖాయము, ఖాయిదా, ఖాళీ (కాళీ), ఖాసా, ఖిల్లా, ఖుద్దున, ఖులాసా (కులసా) ఖైది (ఖైదు)

గప్చిప్పు, గప్పాలు, గమ్మత్తు, గయాళీ, గలబ, గల్లా, గల్లీ, గస్లీ, గాగరా, గాడు, గాబరా, గిరాకీ, గుంజాయిషీ, గుజరానీ, గుజరాయించు, గుజర, గుజిలి, గుజస్తీ, గుత్తేదారు, గుబారు, గుమాస్తా, గులాబి, గులాము, గైరు, గైరుహాజరు, గోడ, గోండు, గోరీ, గోలీ, గోషా, గోష్వారా, ఝతత

చర్చ, చలాకి, చలానా, చలామణీ చాందినీ, చాకిరీ, చాకు, చిరునామా, చెలామణి, చందా, చందుకా, చోపుదారు, చౌదరి, చౌరాస్తా, ఛాపా, ఛావు,

జంజీరు, జంపఖానా, జంబుఖానా, జనాభా, జనానా, జమాదారుడు, జరిమానా, జవాబు, జవాహిరి, జాగ, జాగీరు, జాబు, జాబితా, జాటి,జరీ (చీరలు), జారీ, జాస్తి, జిరాయితీ, జిల్లా, జిల్లేదారుడు, జెండ, జేబు, జేరుబందు, జట్టీ, జప్తీ, జమ, జమీను, జమీందారు, జముజాలి, జరబాజు, జరీ, జరూరు, జాబితా, జామీను, జుబ్బా, జుమలా, జుల్మానా, జోడ, జోడు, జోరు,

టపా, టలాయించు, టటాకీ, రాణా,

డలాయతు, డల్లీ, డవాలీ, డులా, డోలి,

తండేలు, తకరారు, తగాదా, తనఖా, తనిఖీ, తప్సీలు, తబ్దీలు, తరందారీ, తరద్దూదు, తరహా, తరీఖు, తర్జుమా, తవాయి, తస్రపు (తసరబు), తహశ్శీలు, తాకీదు, తాజా, తారీఖు, తాలూకా, తాలూకు, తాళాబందు, తివాసీ (తివాచి), తీరువ, తీరువజాస్తి, తుపాను, తైనాతీ, తోపరా,

దంగా, దగా, దగుల్బాజీ, దఫా, దబాయించు, దబేనా, దమదమా, దమ్మిడు, దరఖాస్తు, దరిమిలాసు, దరియాప్తు, దరుజు, దరోబస్తు, దర్జా, దర్జీ, దర్బారు, దర్యాప్తు, దలాలీ, దవుడు (దౌడు), దస్తీ, దాఖలు, దాణా, దామాషా, దారోగా, దాల్చిని, దాళా, దావా, దినుసు, దిమాకు, దిటవాణము, దివాలా, దివాలాకోరు, దుకాణము, దుప్పటి, దుబారా, దుబాసీ, దురాయీ, దుర్భిణి, దేవిడు, దౌడు, దౌలత్తు,

ధూకళి,

నంజ (నంజి), నకలు, నకషా, నకీబు, నక్కీ, సఖరా, నగదు, నగారా, నగీషీ, నజరానా, నఫరు, నఫరు జామీను, నఫా (సభా), నమూదు (నమోదు), నమూనా (నమోనా), నమ్మకు, నవరసు, నవారు, నవుకరీ (నౌకరీ), నవుకరు, నాగా, నాజరు, నాకు, నాడ, నాదూరు, నామోషి, నారింజ, నిఘా, నిరుకు, నిలీను, నిశాని, నిషా, నిషిందా, నిసబు, నెజా, నౌబత్తు,

పంఖా, పంచాయితీ, పకాళి, పకోడి, పచారు, పజీతి, పటాకి, పట్కా, పట్కారు, పట్టా, పట్టీ,పత్తా, పత్తాపరంజు, పరకాళా,పరాకు, గుడ్డ, పరగణా, ఫర్మానా, పరవా, పరారీ, పలాన, పల్టీ, పసందు, పస్తాయించు, పాంజేబు, పాజీ, పాపాచి, పాపోసు, పాయకట్టు. పాయకారీ, పాయమాలీ, పాయిఖానా, పారా, పారీఖత్తు, పాలకి (పల్లకి) పావు, పావులా, పిచాడు, పిచ్చికారు, పితూరీ, పీరు, పిరుసుడి, పుంజనేల, పుకారు, పులావు, పుసలాయించు, పూచీ, పూరా, పేరస్తు, పేషిగీ, పేషి, పేష్కషు, పేష్కారు, పైజారు, పైమాయిషీ, పైలుమాను, ఫైసలా, పోరంబోకు, పోచాయించు, పోంచావణి, పోస్తకాయ, పళిలిజు,

ఫకీరు, ఫక్తు, ఫయిసలా, ఫర్మానా, ఫలానా, ఫసలీ, షాయిదా, ఫిరాయించు, ఫిర్యాదు, ఫక్కీ

బంగ్లా, బంగి (భంగి) బంజారి, బంజరు బందోబస్తు, బకాయి, బజంత్రీ (భజంత్రీ), బట్టువాసంచి, బట్వాడ, బడ, బడాయి, బత్తీస, బత్తెము (భత్తెము). బదిలి, బనాతు (బణాతు), బసాయించు,బయాన, బర్తరపు, బరమా, బరాబరి, బరాబరిక, బస్తా బస్తీ, బహద్ధర్‌ (బహద్దూర్‌), బాకా, బాకీ, బాకూ, బాజా, బాజారు, బాజు, బాజుబందు,బాతాఖానీ, బాతు, బాదము, బాపతు, బారా, బాలీసు, బావుటా, బావుడోరు, బిచానా, బిడయించు, బినామీ, బిబ్చీ, బిల్మక్తా, బిసాతు, బస్తీ, బీమా, బుంగ, బురకా, బురుజు, బులాకీ, బూబు, బూర్నీసు, బేగి, బేజరూరు, బేజారు, బేపరాకు, బేబాకి, బేమరమ్మతు, బేరీజు, బేవారసు, బేషకు, బేషు (బేషు), బేసరి, బోణి, బోనాంపెట్టె, బోషాణం, బరవాసా, బాట (బాట),

భర్తీ, భేటీ, భోగట్టా, భరోసా, భాజాప్త

మంరు, మండు, మకాము, మక్తా, మఖమలు, మగ్దూరు, మజిలీ, మజ్కారు, మజుబూతు, మజుమూను, మరి, మ్దరు, మజా, మజాకా, మతలబు, మతాబు, మతించు, మద్ధతు, మిన్నా, మన్న, మరమ్మతు, మర్తబు, మలాము (టమొలాము), టమొహమల్‌, మల్పూవు, మషాకత్తు, మషాలు, మషాల్జీ, మసాలా, మసీదు, మహజరు, మహస్సూలు, (మసూలు), మాజీ, మాపుచేయు, మామూలు, మారీఫత్తు, మాలీసు, మింజుమల, మిజాజు (మీజాదు), మిఠాయి, మినహా, మిరాసీ, ముక్తసరు, ముక్త్యారు, ముగ్దరు, ముచ్చివాడు, ముచ్చలికా, ముఠా, ముదరా, (ముజరా), ముద్దతు, ముద్దాయి, మునసబు, మునిషీ, ముభావము, మురబ్బా, ముల్కీ, ముసద్దీ, ముసనాబు, ముసల్మాను, ముస్తాబు, ముసాయిదా, ముస్తీదు, మెహదా, మెహనతు, మొస్తరు,.

యకాయకి (ఎకాయెకి), యదాస్తు, యునాని,

రకము, రజా, రద్దు, రద్దీ, రప్పు, రయితు (రైతు), రవాణా, రవేసు (రవీసు), రస్తా, రస్తు, రహదారీ (రాదారి), రాజీనామా, రాయితీ, రివాజు, రుజువు, రుమాలు, రుమాలు, రుసుము, రేవల్చిని, రొట్టె, రోజు, రోదా, రౌతు, రొఖ్ఖము.

లంగరు, లగాము, లగాయతు, లడయి, లడి, లమిడి (లమ్డి), లస్కరు, లాచారు, లాడము, లాయఖు, లాలు, లాలూచీ, లిఫాఫా, లుంగీ, లుగుసాను, లుచ్ఛా, లూటీ, లేవిడి, లోటా, లోటు,

వకాలతు, వకీలు, వగైరా, వజా, వజీరు, వర్దీ, వసూలు, వస్తాదు, వహవ్వా, వాకబు, వాజివీ, వాపసు, వాయిదా, వారసుడు, వారీ, వారీనామా, విలియా, వేరియా, వేలము (వేలాము), వేలంపాట,

శాబాసు (సెబాసు), శాయి, శాయిరు (సాయిరు), శాల్తి, శాలువ, శకస్తు శికా, శిస్తు, విస్సాల, శెటమ్మె (సెటమ్మె), శేరు (సేరు),

షరతు, షరా, షరాబు, షహా, షికారీ, షికారు, షుమారు,

సంజాయిషీ, సందుగు, సకాలాతు, సక్తుచేయు, సగటు, సగతు, సగలాతు, సజావు, సజ్జనకోల, సదరు (సదరహీ), సన్‌వారు, సన్నదు, సన్నాయి, సన్నీ, సఫేదా, సబబు, నబరు, నబురు, సబ్జా, నబ్నివీను, సముద్దారుడు, సరంగు, సరంజామ, సరదా, సర్దారు, సరకు, సరేసు, సర్కారు, సలహా, సలాము, సలిగ, సవాలు, సాంబా, సాకీన్‌, సాబా, సాదరు, సాదర్వారీ, సాదా, సాపు (సాపు), సాబకు, హుకుం, సామాను, సాలస్త్రీ, సాలు, సాలాబాదుగా, సాలీనా, సాలు బస్సాలు, సాళవా,దాళవా, సాహెబు, సిద్దీ, సిపాయి, సిరా, సిబ్బంది, సిలువ, సిసలు, సిస్తు, సిస్సాల, సీదా, సీసా, సుకారి, సుక్కాను (చుక్కాని), సునామణి (సుణామణీ), సున్నతి, సుమారు, సురమా, సుల్తాను, సుసారము, సుస్తీ, సెల్లా, సోకు (శౌక్), సోగ్గాడు , సోదా (సౌదా),

హంగామి, హండ, హంసాయి, హకీకత్తు, హక్కసు, హక్కు, హజారము, (అజారము), హద్దు, హటమేషా, హయాము, హరామి, హర్కారా, హల్కా (అల్కి), హటవేలి, హాజరు, హమీతకావి, హాలు, హాలుసాలు, హశ్శీలు (హసీలు), హిజారు (ఇజారు), హుండు, హుకుము, హుజారు, హుటా హుటిన, హురుమంజి, హురుమత్తు, హుషారు (ఉషారు), హేజీబు, హైరానా (హైరాను), హోదా, హోదా (హవుదా), హవుసు, హవుసుకాడు, హసుతోట.

ఇవీ చూడండి

మార్చు

"తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము" అనే పుస్తకంలో గోపాల కృష్ణారావు ఉరుదూ పారశీకములందు అరబీ భాష నుండి పెక్కు పదములు ప్రవేశించినవి. కనుక పరోక్షముగా అరబీ పదములు కూడ తెలుగులో చేరినవనుట నిశ్చయము అన్నారు.

మూలాలు

మార్చు
  • "తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము" - గోపాల కృష్ణారావు పుస్తకం.
  • తెలుగు ఇంగ్లీషు నిఘంటువు సి.పి.బ్రౌన్