తెల్లబూరుగ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తెల్లబూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సీబా పెంటాండ్రా (Ceiba pentandra) సీబా పెంటాండ్రా మాల్వేసీ కుటుంబానికి చెందిన ఉష్ణమండలపు చెట్టు. ఇదివరకు దీన్ని బాంబకేసీ కుటుంబంలో చేర్చేవారు. తెల్లబూరుగ చెట్టు మెక్సికో, మధ్య అమెరికా, కరిబ్బియన్, ఉత్తర దక్షిణ అమెరికా దేశాలకు స్థానికమైనది. సీబా పెంటాండ్రా రకం గ్వినెన్సిస్ అనే ఒక్క రకం ఆఫ్రికా ఖండపు పశ్చిమ భాగంలోని ఉష్ణమండలంలో కనిపిస్తుంది. ఆంగ్లంలో ఈ చెట్టునూ, కాయల నుండి వచ్చే దూదిని కూడా కాపోక్ (Kapok) అని విరివిగా వ్యవహరిస్తారు. ఈ చెట్టునే జావా కాటన్, జావా కాపోక్, సిల్క్ కాటన్, సీబా అని కూడా వ్యవహరిస్తారు.
తెల్లబూరుగ | |
---|---|
![]() | |
హొనలులూ, హవాయిలో నాటిన తెల్లబూరుగ చెట్టు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. pentandra
|
Binomial name | |
Ceiba pentandra |
చిత్రమాలికసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
వెలుపలి లింకులుసవరించు
Look up తెల్లబూరుగ in Wiktionary, the free dictionary.