తేజస్విని కొల్హాపురే
తేజస్విని కొల్హాపురే (జననం 1980 జనవరి 1) భారతీయ నటి, మోడల్.[2]
తేజస్విని కొల్హాపురే | |
---|---|
జననం | [1] ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1980 జనవరి 1
వృత్తి | నటి, మోడల్ |
జీవిత భాగస్వామి | పంకజ్ సరస్వత్ |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
కెరీర్
మార్చుఆమె జీ టీవీలో రాజా బుందేలా దర్శకత్వం వహించిన ముఝే చాంద్ చాహియే అనే టెలివిజన్ ధారావాహికతో తన అరంగేట్రం చేసింది. ఆ తరువాత మోడలింగ్ రంగంలోనూ, చిత్రసీమలోనూ అడుగుపెట్టింది.
ఆమె జీ టీవీలో రిష్తే అనే మినిసిరీస్ ఎపిసోడ్‌లలో, సౌఘత్, తుమ్ బిన్ లలో నటించింది. ఆమె నాటకరంగంలో కూడా రాణించింది.[3]
ఆమె 1992 సంవత్సరంలో కృపా క్రియేషన్స్ - విమల్ ఎన్. ఉపాధ్యాయ ప్రచురించిన ఫ్యాషన్ కేటలాగ్‌లో మోడలింగ్ అసైన్‌మెంట్ చేసింది. ఈ కేటలాగ్ అదే ఎడిషన్‌లో, ఆమెతో పాటు ఐశ్వర్య రాయ్, సోనాలి బింద్రే, నికి అనెజా తదితరులు ఉన్నారు.[4]
ఆమె పాంచ్ (2003), అగ్లీ (2013) హిందీ చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధిచెందింది.[5][6][7][8][9]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె ముంబైలో కొల్హాపూర్‌కు చెందిన మరాఠీ కుటుంబంలో జన్మించింది.[10] ఆమె తండ్రి పండరీనాథ్ కొల్హాపురే శాస్త్రీయ గాయకుడు.[11] ఆమె శక్తి కపూర్ భార్య శివంగి కొల్హాపురే, పద్మిని కొల్హాపురే లకు సోదరి. అలాగే శ్రద్ధా కపూర్‌కి ఆమె పిన్ని.
ఆమె గాయని లతా మంగేష్కర్‌కి మేనకోడలు, ఆమె నాన్నమ్మ లత తండ్రి అయిన దీనానాథ్ మంగేష్కర్‌కి సవతి సోదరి.[12] ఆమె తల్లి మంగళూరు వాసి నిరుపమ ప్రభు ఆమె కుటుంబం మంగళూరుకు చెందినది. ఆమె ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేసింది.[13]
తేజస్విని కొల్హాపురే పంకజ్ సరస్వత్ ని వివాహం చేసుకుంది. వీరికి 2015లో ఒక కుమార్తె జన్మించింది.[14]
మూలాలు
మార్చు- ↑ "Tejaswini Kolhapure: Movies, Photos, Videos, News & Biography | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2019-05-20.
- ↑ "All you want to know about #TejaswiniKolhapure". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2019-05-20.
- ↑ Dundoo, Sangeetha Devi (16 May 2017). "Politics of water". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-07-08.
- ↑ "Viral: The Internet Found Aishwarya Rai Bachchan's Modelling Contract From 1992. She Was Paid..." NDTV.com. Retrieved 2023-02-11.
- ↑ "I trust Anurag Kashyap blindly: Tejaswini Kolhapure". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-12-27. Retrieved 2017-07-08.
- ↑ Bhattacharya, Roshmila (17 December 2014). "Tejaswini breaks 14-year-old jinx - Times of India". The Times of India. Retrieved 2017-07-08.
- ↑ "Ugly - An emotional story in the garb of a thriller - Times of India". The Times of India. 24 December 2014. Retrieved 2017-07-08.
- ↑ Bhattacharya, Roshmila (17 December 2014). "Tejaswini breaks 14-year-old jinx - Times of India". The Times of India. Retrieved 2017-07-08.
- ↑ Kaushal, Sweta (2014-12-25). "Ugly review: A dark, gripping movie that is a must watch". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2017-07-08.
- ↑ "Tejaswini Kolhapure Biography". Cinetalkers.com. 26 December 2014. Retrieved 2017-07-08.
- ↑ If I had my way, I would have worked with Raj Kapoor all my life: Padmini Kolhapure, Times of India, 13 September 2013.
- ↑ "'I feel bad about it…' | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 16 June 2009. Retrieved 8 July 2017.
- ↑ If I had my way, I would have worked with Raj Kapoor all my life: Padmini Kolhapure, Times of India, 13 September 2013.
- ↑ Bhattacharya, Roshmila (1 February 2015). "Tejaswini Kolhapure delivers a baby girl - Times of India". The Times of India. Retrieved 2017-07-08.