నికి అనెజా వాలియా భారతీయ సినిమా నటి. ఆమె ప్రధానంగా హిందీ చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో నటిస్తుంది. ఆమె నటుడు పర్మీత్ సేథికి కజిన్.

నికి అనేజా వాలియా
2019లో నికి అనేజా వాలియా
జననం (1972-09-26) 1972 సెప్టెంబరు 26 (వయసు 51)
జాతీయతభారతీయురాలు
విద్యసెయింట్ థెరిసాస్ కాన్వెంట్ స్కూల్, శాంటాక్రూజ్, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సోనీ వాలియా
(m. 2002)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • నారాయణ్ అనేజా (తండ్రి)
బంధువులుపర్మీత్ సేథి
అర్చన పూరణ్ సింగ్ (కోడలు)

కెరీర్ మార్చు

నికి అనెజా హిందీ సినిమా నటి, మోడల్. అలాగే టెలివిజన్ వీజె, హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంది. ఆమె దాదాపు 30 సంవత్సరాల పాటు 31కి పైగా టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది.[1]

జీ టీవీలో హిందీ టీవీ సిరీస్ అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీలో డాక్టర్ సిమ్రాన్ మాథుర్ పాత్రలో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. ఆమె జీ టీవీ సీరియల్ "బాత్ బన్ జాయే"లో నిక్కీ పాత్రను పోషించింది.[2]

ఆమె ఫెమినా మిస్ ఇండియా 1994కి న్యాయనిర్ణేతగా కూడా ఉంది, ఆ సమయంలోనే ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ప్రపంచ సుందరి, సుస్మితా సేన్‌కు మిస్ యూనివర్స్ కిరీటాలు దక్కాయి.

ఆమె 1991లో మిస్ వరల్డ్ యూనివర్శిటీలో రన్నరప్‌గా నిలిచింది, ఫలితంగా ఆమె 1991–1992లో శాంతికి ప్రపంచ రాయబారిగా నిలిచింది. ఆమె యునైటెడ్ కింగ్‌డమ్ మొట్టమొదటి బ్రిటిష్ ఆసియా సోప్( British Asian soap) అయిన క్లౌడ్ 9లో పనిచేసింది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె ఫిబ్రవరి 2002లో సోనీ వాలియాను వివాహం చేసుకుంది.[3][4] అదే సంవత్సరం యూకె వెళ్లింది. ఈ జంటకు కవలలు అబ్బాయి సీన్, అమ్మాయి సబ్రినా జన్మించారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఇంగ్లాండులో నివాసం ఉంటోంది.[5]

మూలాలు మార్చు

  1. "'I believe in understanding the heart of the character' : Niki Aneja". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 2006-11-25. Archived from the original on 4 February 2019. Retrieved 2019-07-25.
  2. ROSHNI K OLIVERA, 18 Apr 2009, 12.00am IST (2009-04-18). "Niki is back!". The Times of India. Archived from the original on 2012-10-23. Retrieved 2013-04-07.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "Niki Walia spotted in Mumbai". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 August 2019. Retrieved 2019-07-25.
  4. Venkatesh, Jyothi (2005-10-13). "Nikki Aneja to take break from acting". Daily News and Analysis (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2019. Retrieved 2019-07-25.
  5. Olivera, Roshni. "Niki Aneja: I'm here to re-introduce myself to people". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2019. Retrieved 2019-07-25.