తేజస్వినీ సావంత్

తేజస్వినీ సావంత్ (మరాఠీ: तेजस्विनी सावंत) (జననం.సెప్టెంబర్ 12, 1980) మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన భారతీయ షూటర్.ఆమె తండ్రి రవీంద్ర సావంట్ ఇండియన్ నావికా దళంలో అధికారి.[1] ఆమె ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మద్దతు పొందింది.[2]ఈమె ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళ గా చరిత్రలో నిలిచింది.

Medal record
Women's shooting
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
ISSF World Shooting Championships
స్వర్ణము 2010 Munich 50 m rifle prone
ISSF World Cup
కాంస్యం 2009 Munich 50 m rifle 3 positions
Commonwealth Games
స్వర్ణము 2006 Melbourne 10 m air rifle pairs
స్వర్ణము 2006 Melbourne 10 m air rifle
రజతం 2010 Delhi 50 m rifle 3 positions pairs
రజతం 2010 Delhi 50 m rifle prone
కాంస్యం 2010 Delhi 50 m rifle prone pairs
తేజస్వినీ సావంత్

జీవిత చరిత్ర

మార్చు

తేజస్విని తల్లిదండ్రులు సునీతా, రవీంద్రలు.వారు కొల్హాపూర్ కు చెందినవారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు. వారు అనూరాధా పిత్రే, విజయ్ మల గవై. వారిద్దరూ వివాహితులు. ఆమె తండ్రి 2010 లో మరణించాదు. ఆమె కొల్హాపూర్ లోణి "జైసింగ్ కుశాలే" వద్ద శిక్షణను ప్రారంభించారు. ఆమె "కుహేలీ గంగూలీ" అనే వ్యక్తిగత కోచ్ వద్ద శిక్షణ పొందారు..[3] ఆమె స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ లో ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ లో నియమించబడ్డారు.[4]ఆమె ఆగస్టు 29 2011 న అర్జున అవార్డు పొందారు. సావంత్‌కు ఇదేమీ అంత తేలిగ్గా వచ్చిన విజయం కాదు. తేజస్వినీ తండ్రి నేవీ ఆఫీసర్‌. 1971లో యుద్ధసైనికుడు కూడా. గత మార్చిలో ఆయన చనిపోయారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులందరూ తేజస్విని ప్రోత్సహించారు. ఎంత కష్టమైనా, ఖరీదైనా సరే తేజస్వినీకి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఆమె సాధనకు మాత్రం ఎప్పుడూ ఆటంకం కలిగించలేదు. సావంత్‌ కోరుకున్న స్థానానికి ఎదగాలని కోరుకున్నారు. మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ సావంత్‌ కూడా వాటిని లెక్కచేయలేదు. ఎలాగైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతోనే కష్టపడింది. ఇబ్బందులు వచ్చినా వాటి ప్రభావాన్ని తన ఆటమీద పడకుండా చూసుకుంది. మిగిలిన అన్ని పనులను చక్క బెట్టు కుంటూనే సాధన కొనసాగింది.

కెరీర్

మార్చు

సావంత్ 9వ దక్షిణ ఆసియా స్పోర్ట్స్ ఫెడరేషన్ గేంస్ లో 2004 లో ఇస్లామాబాదులో పాల్గొన్నారు. ఆమె అచట భారతదేశానికి బంగారు పతకాన్ని తెచ్చారు.

2006 కామన్వెల్త్ ఆటలు

మార్చు

ఆమె ఆసియన్ గేమ్స్ కు ముందుగా 2006 కామన్ వెల్త్ క్రీడలకు భారతదేశం తరపున ఎంపిక కాబడినారు. ఆమె 2006 కామన్వెల్త్ గేమ్స్‌లో అవనిత్ సిద్ధూతో కలిసి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (పెయిర్స్)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది[5].

ISSF ప్రపంచ కప్, ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్

మార్చు

మహిళా షూటర్‌ తేజస్వినీ సావంత్‌ చరిత్ర సృష్టించింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. భారత్‌కు చెందిన ఒక మహిళా షూటర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ఈ పతకం హస ్తగతం చేసుకుంది. సావంత్‌ మొత్తం 597(100, 100, 100, 99, 99,99) పాయింట్లు పొందింది. 1988లో రష్యాకు చెందిన మరీనా బాబ్కోవా నెలకొల్పిన రికార్డును సమం చేసింది. ఇంతకుముందు కామన్వెల్‌‌త గేమ్‌‌సలో ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణ పతకం గెలుచు కుంది. పోలండ్‌కు చెందిన ఎవా జోన్నా నోవాక్సోస్కాతో సమానంగా పాయింట్లు పొందినప్పటికీ మెరుగైన 41 ట్యాలీ కారణంగా స్వర్ణ పతకం పొందింది.[1]

2010 కామన్వెల్త్ ఆటలు

మార్చు

న్యూఢిల్లీ లో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడలలో ఆమె 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ సింగిల్స్ రజత పతకాన్ని పొందింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ లో జంట విభాగంలో కాంస్యపతకాన్ని సాధించింది(మీనా కుమారి తో కలసి)..[6] ఆమె 50 మీటర్ల రైఫిల్ 3 పొసిషన్ ఈవెంట్లో (లజ్జకుమారి గోస్వామి తో కలసి) రజత పతకాన్ని సాధించింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Cyriac, Biju Babu (9 August 2010). "Sawant shoots historic gold at World Championships". The Times of India. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 9 August 2010. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-03-15. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. [1] Archived 2013-06-18 at the Wayback MachineTimes of IndiaAugust 10, 2010.
  4. [2]DNAAugust 9, 2010.
  5. "SIDHU Avneet Kaur". Melbourne 2006 Commonwealth Games Corporation. Archived from the original on 29 October 2009. Retrieved 22 January 2010.
  6. Masand, Ajai (11 October 2010). "Shooters forced to settle for bronze". Hindustan Times. New Delhi. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 12 October 2010. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఇతర లింకులు

మార్చు