తేలు లేదా వృశ్చికము (ఆంగ్లం Scorpion) అరాక్నిడా (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన జంతువు. వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి.[1][2]

తేలు
ఖావొ యై జాతీయ పార్కు, థాయిలాండ్ లోని ఆసియా అడవి తేలు(Heterometrus spinifer)
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Subclass:
Order:
Scorpiones

Superfamilies

Pseudochactoidea
Buthoidea
Chaeriloidea
Chactoidea
Iuroidea
Scorpionoidea
See classification for families.

నొప్పి తగ్గడానికి

మార్చు

తేలు కుట్టినచో నొప్పి తగ్గడానికి ఆంగ్ల వైద్యంలో మందులు,సూదులు లేవు. నరాల పైన కుట్టినచో (అల్లోపతి) ఆంగ్ల వైద్యంలో మందులు ఉన్నాయి. అయతే ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా మంట నొప్పి తగ్గడానికి ఉత్తరేణి ఆకుల్ని దంచి రసం తీసి మిశ్రమం తో పాటు కుట్టినచోట రుద్దితే పైకి ఎక్కిన కిందకు దిగి వస్తుంది. హోమియో చికిత్స ద్వారా మాత్రమే నొప్పి మంట తగ్గుతుంది. ఎర్ర ఉల్లిగడ్డ ను రెండు ముక్కలుగా కోసి కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. ఇది ఎర్ర తేలు కుట్టినచో వైద్యం. ఇతర రకాల వాటికి కూడ హోమియో చికిత్స వెల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, ఉప్పు, పసుపు,నిమ్మ కాయ రసం కలిపి దంచి తయ్యారు చేసిన దానిని కొద్దిగా తీసుకుని కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. తగ్గిన తరువాత నీటితో కడిగితే మంచిది. కాలుకు చేతులకు కుట్టినచోట కొందరికి మాత్రమే కుట్టినచోట మంట నొప్పి ఉంటుంది మరి కొందరికి నొప్పి పైకి వచ్చి కాలు లేదా చేతికి మొత్తంగా నొప్పి వస్తుంది. దీనికి ముందు ఆయుర్వేద చికిత్స తరువాత పైన చెప్పిన హోమియో చికిత్స సరిపోతుంది. ఇక ముఖ్యంగా నరాల మీద తేలు కుట్టినచో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. పైన పేర్కొన్న అంశాలు నొప్పి తగ్గడానికి అని గమనించాలి. ఇక కొంత మందికి కుట్టినచోట నొప్పి సుమారు ఇరవై గంటల వరకు ఉంటుంది. దానికి కూడా కొందరు వ్యక్తులు కరంటు షాక్ ఇచ్చిన తగ్గించవచ్చ అంటుంటారు. తేలు రాయి తగిలించిన మరి కొందరు చింత గింజ రెండు ముక్కలు చేసి బండమీద రుద్ది కుట్టినచోట తగిలించిన విషాన్ని లాగేస్తూదని అంటున్నారు. ఇవన్నీ కాకుండా మరిన్ని చర్యల వల్ల నొప్పి తగ్గడానికి ఎన్నో ఏళ్లుగా రకాల పద్ధతుల్లో నొప్పి తగ్గడానికి వైద్యం ఉంది. పసరు వైద్యం కుట్టినచోట రుద్దితే పర్వాలేదు కానీ చెవిలో పోసి తగ్గడానికి లాంటి మూడాచారాలు పాటించరాదు.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] తేలు నామవాచకంగా వృశ్చికం అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm, ) swell, ripen (as a boil, ) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు అనగా To open (the eyes) wide. కండ్లు తేలవేయు to stop winking అని అర్ధం. తేలు చేప ఒక రకమైన చేప. తేలాడు (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. తేలిక n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. బరువులేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు v. n. To arise, to be born పుట్టు.

తేలు పై తెలుగు భాషలో గల కొన్ని సామెతలు, పొడుపు కథలు

మార్చు
  • తేలు కుట్టిన దొంగ
  • గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారిని... వడ్డించే బొమ్మ

ఇతర విశేషాలు

మార్చు
  • తేలు పై ఒక చుక్క సారాయి వేస్తే అది తనను తాను కుట్టుకొని చనిపోతుంది.
  • తేలు కుట్టిన చోట కుంకుడుకాయ గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.

మూలాలు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. Benton, T. G. (1991). "The Life History of Euscorpius Flavicaudis (Scorpiones, Chactidae)" (PDF). The Journal of Arachnology. 19: 105–110. Retrieved 2008-06-13.
  2. Rein, Jan Ove (2000). "Euscorpius flavicaudis". The Scorpion Files. Norwegian University of Science and Technology. Retrieved 2008-06-13.
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం తేలు పదప్రయోగాలు.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=తేలు&oldid=2823311" నుండి వెలికితీశారు