తోట సీతారామలక్ష్మి
తోట సీతారామలక్ష్మి, (జననం 1951, సెప్టెంబరు 12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, ఉప్పులూరు గ్రామంలో జన్మించింది. తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి భారత పార్లమెంటు సభ్యురాలిగా (రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించింది.[1]
తోట సీతారామలక్ష్మి | |||
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
| |||
పదవీ కాలం 2014 ఏప్రిల్ 10 – 2020 ఏప్రిల్ 9 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఉప్పులూరు, ఉండి మండలం, పశ్చిమగోదావరి జిల్లా | 1951 సెప్టెంబరు 12||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | తోట సత్యనారాయణ |
పార్లెమెంటు సభ్యురాలిగా అయ్యే ముందు ఆమె 2005 నుండి 2010 వరకు భీమవరం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా తన సేవలందించింది. ఆమె 2009 నుండి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు తెలుగుదేశం పార్టీఅధ్యక్షురాలిగా పనిచేసింది.[2] ఆమె ఎంపిగా పదవీకాలం 2014 ఏప్రిల్ 10 నుండి 9 ఏప్రిల్ 2020 ఏప్రిల్ 9 వరకు కొనసాగింది. [3] ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 2014-04-05. Retrieved 2014-06-04.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "'భీమవరం' టిడిపి ఇన్‌ఛార్జ్‌గా 'తోట సీతారామలక్ష్మీ'". janamonline.com. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.
- ↑ "Thota Seetharama Lakshmi". Government of India. Retrieved 15 October 2015.