భీమవరం పురపాలక సంఘం

భీమవరం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పట్టణం భీమవరానికి స్థానిక స్వపరిపాలన సంస్థ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం‌లోని, భీమవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

భీమవరం పురపాలక సంఘం
భీమవరం
స్థాపన1948
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
భీమవరం
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

భీమవరం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 150 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1948లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించారు.భీమవరం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ముఖ్య పట్టణాలలో ఒకటి. పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి.[1]

జనాభా గణాంకాలు

మార్చు

భీమవరం పురపాలక సంఘంలో 39 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2001 లో పట్టణ జనాభా 137409 ఉండగా 2011 లో 142,184 కు పెరిగింది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 142,184 జనాభా ఉండగా అందులో పురుషులు 70,044, మహిళలు72,140 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 70%. ఉండగా అందులో పురుష జనాభాలో 56%, స్త్రీ జనాభాలో 44% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 13,137 ఉన్నారు. భీమవరం పురపాలక సంఘంలో మొత్తం 37838 గృహాలు ఉన్నాయి.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా‌ కోటికలపుడి గోవింద రావు పనిచేస్తున్నాడు.[3] వైస్ చైర్మన్ గా ముదునూరి సత్యనారాయణ రాజు పనిచేస్తున్నాడు.[3]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘం 25.64 చదరపు కి.మీ. విస్తరించి ఉంది. ఈ పురపాలక సంఘంలో 56 మురికివాడల ఉండగా అందులో జనాభా 32973 మంది ఉన్నారు. మొత్తం గృహాలు 37838, ప్రాథమిక పాఠశాలలు 51, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 43, మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి .

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 2016-01-28. Retrieved 19 June 2020.
  2. "Bhimavaram City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

మార్చు