త్రివర్ణ పదార్ధాలు

త్రివర్ణ పదార్ధాలు అనగా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు. మూడురంగుల జెండా చూసినప్పుడల్లా ముచ్చటగా ఉంటుంది . అలాగే ఆ మూడు రంగుల పదార్ధాలు తినడము వల్ల మనకెంతో లాభము ఒనగూడుతుంది. ఏమిటా లింక్ అని నవ్వుకున్నా .... నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పదార్ధాలు మన ఆరోగ్యానికి మంచిది .

త్రివర్ణ పతాకం రంగుల వలె త్రివర్ణ పదార్థాలు

నారింజ రంగు

మార్చు

ఈ రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో బీటా-కెరటిన్‌, విటమిన్‌ "సి" అత్యధికంగా లభిస్తాయి. వయసు రీత్యా లోపించే దృష్టి మెరుగవడానికి సహకరించే పోషకాలు వీటిలో ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోగలవు, కొలెస్టరాల్, రక్తపోటు లను తగ్గించి కొలాజెన్‌ ఏర్పడడాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యవంతమైన జాయింట్స్ కు దోహదపడతాయి.

బొప్పాయి

ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది . ఇతర ప్రోటీన్లు, జీర్ణసంబంధిత ఎంజైములు, విటమిన్‌ " ఎ", " ఇ ", లు పొటాషియం లభిస్తాయి. సహజసిద్ధమైన లాక్జేటివ్స్ కలిగి ఉంటాయి.

కమలా, బత్తాయి
వీటిలో విటమిన్ " సి " సాంద్రత ఎక్కువ . యాంటి ఆక్షిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతము చేస్తాయి. పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది .
క్యారెట్లు
కంటి దృష్టికి మంచివి . విటమిన్‌ " ఎ, కె , సి , లు .. పొటాషియం , ఫైబర్ , మెగ్నీషియం , ఫాస్పరస్ , ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి .

తెలుపు రంగు

మార్చు

రోగనిరోధక వ్యవస్థను ఆందించే పోషకాలు తెల్లని పదార్థాలలో ఉంటాయి . కొలెస్టరాల్ , రక్తపోటుస్థాయి సరిగా ఉంచుకునేందుకు సహకరిస్తాయి. తెలుపు రంగు గల కొన్ని పదార్ధాలు :

ఉల్లి , వెల్లుల్లి
సల్ఫైడ్ , ఎల్లిసిన్‌ అనే ఫైటోకెమికల్స్ అధికము గా ఉంటాయి. ట్యూమర్లకు వ్యతిరేకము గా ఇవి పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి , రక్తములో కొవ్వు , కొలెస్టరాల్ లను , బ్లడ్ సుగర్ ను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ లక్షణాలు కలిగిఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని సమర్ధవంతం గా పెంచుతాయి. జలుబు పై పోరాడే మంచి ఆహారము .
ముల్లంగి
ఎక్కువగా పీచు పదార్ధము , తేమ , సహజమైన లాక్జేటివ్స్ ఉన్నాయి . దీనిలోని అధిక తేమ చర్మానికి , కళ్ళకు ఎంతో మేలుచేస్తుంది .

ఆకుపచ్చ

మార్చు

ఈ రంగు పండ్లు , కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి . క్లోరొఫిల్ , పీచుపదార్థము , ఫోలిక్ యాసిడ్ , కాల్సియం , విటమిన్‌ " సి " , బీటాకెరటిన్స్ లభిస్తాయి . ఈ రంగు పదార్ధాలలోని పోషకాలు క్యాన్సరు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి . రక్తపోటు, క్లెస్టరల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణక్రియకు దోహదపడి , కంటి ఆరోగ్యానికి , దృష్టికి సహకరిస్తాయి . ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి రోగనిరోధ వ్యవస్థను మెరుగుపరుస్తాయి .

పాలకూర
ఐరన్‌ , ఫొలిక్ యాసిడ్ ,అధికం గా ఉంటాయి . పుట్టుకతో వచ్చిన లోపాల్ని సరిచేయడానికి సహరిస్తుంది . దీనిలో అత్యధికంగా లభించే క్యాల్సియం , పీచు జీర్ణక్రియకు , చర్మానికి మేలు కలిగిస్తాయి.
బ్రకోలి
క్యాన్సర్ వ్యతిరేకగుణాలు ఎక్కువ . యాంటీ ఆక్షిడెంట్స్ , ఖనిజాలు , ఏ, సి, విటమిన్లు లభిస్తాయి.
కివి
విటమిన్‌ "సి " ఎక్కువగా ఉంటుంది . పొటాషియం లభిస్తుంది . ఇది కంటి దృష్టి బలహీనతలనుండి కాపాడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి . తేమ అధికముగా ఉంటుంది. చర్మానికి ఎటువంటి హాని జరుగుకుండా కాపాడుతుంది .

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు